19-02-2025 01:42:20 AM
కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి ఫైర్
కరీంనగర్, ఫిబ్రవరి18(విజయాక్రాంతి): కూట్లో రాయి తీయనోడు ఏట్లో రాయితీసిన ట్టుగా కేంద్రమంత్రి బండి సంజయ్ తీరు ఉందని, ఓటేసిన కరీంనగర్ ప్రజలకు ఏమి చేయని బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీని ఏమొహం పెట్టుకొని విమర్శిస్తాడని, నిత్యం వార్తల్లో నిలవడం కోసం కేంద్ర మంత్రి బండి సంజయ్,
ప్రతిరోజు రాష్ర్ట ప్రభుత్వా న్ని తిట్టడం, సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిం చడం, మంత్రులపై ఆరోపణలు చేయడం, ఎమ్మెల్యేలను టార్గెట్ చేయకుంటే రోజు పూట గడవని పరిస్థితిగా మారిపోయిందని కూడా చైర్మన్ నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షు డు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి విమర్శించారు.
నగరంలోని సిటీ కాంగ్రెస్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో నరేందర్ రెడ్డి కేంద్ర మంత్రి బండి సంజ య్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో బండి సంజయ్ వందలాది మందిని బ్లాక్మెయిల్ చేసి ఎమ్మె ల్యే టికెట్లు ఇప్పిస్తానని జబర్దస్తీ గా కొందరి ని టార్గెట్ చేసి డబ్బులు దండుకోవడం వల్లనే బిజెపి రాష్ర్ట అధ్యక్ష పదవి ఊడిపో యిందని బిజెపి పార్టీలో జరిగిన ప్రచారం వాస్తవం కాదా అని ప్రశ్నించారు.
వెన్నుపో టు కుట్రలకు కుతంత్రాలకు కేరాఫ్ అడ్రస్ బిజెపి పార్టీ అని నాడు బ్రిటిష్ వారి అడు గులకు మడుగుల అదే పాలసీని అనుసరి స్తూ దేశంలో కులాల పేరుతో మతాల పేరుతో ప్రజల మధ్య వైశామ్యాలను రగిలిం చి విభజన రాజకీయాలకు పాల్పడుతున్న బిజెపిని రాష్ర్ట ప్రజలు బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ర్టంలో 8 మంది బీజేపీ ఎంపీలు 8 మంది బిజెపి ఎమ్మెల్యేలు ఉండగా వారిలో ఏ ఒక్కరికి ఒకరిపై ఒకరికి భరోసా లేదని వారి మధ్య సఖ్యత కోల్పోయినట్టు కనిపిస్తుందని ఎద్దే వా చేశారు. కేవలం ఉనికి కోసమే బండి సంజయ్ రాష్ర్ట ప్రభుత్వంపై గోబెల్స్ విష య ప్రచారానికి తెగబడుతున్నాడని దుయ్య బెట్టారు.
నైతికతలేని వ్యక్తి కాంగ్రెస్ పార్టీ ఎంపీలను ఎమ్మెల్యేలను విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నాడు కెసిఆర్ తెలంగాణను అప్పలపాలు చేస్తే నేడు రా ష్ర్టంపై నరేంద్ర మోడీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని కేంద్ర బడ్జెట్లో తెలంగా ణకు రావాల్సిన నిధులను ఇవ్వకుండా ఏ ముఖం పెట్టుకొని ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి ఓట్లు అడుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బండి సంజయ్ నిత్యం వార్తల్లో ఉండేందుకు అనవసరమైన వ్యాఖ్యలకు తెర లేపుతున్నాడని ఆరోపించారు. ముస్లిం మై నారిటీల మీద విమర్శలు మాని మెజా ర్టీగా నిన్ను గెలిపించిన సమాజానికి నువ్వు ఏ విధమైనటువంటి న్యాయం చేశావు చెప్పాల ని డిమాండ్ చేశారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మొదటి ప్రాధాన్యతగా ఓటు వేస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలవబోతున్నాడని చెబుతున్నాయని ఈ అంశాన్ని పసిగట్టిన బండి సంజయ్ తన తొండి ప్రయత్నాలతో కాంగ్రెస్ పార్టీపై ముస్లిం మైనార్టీలపై అనవ సరమైన విమర్శలు చేస్తూ ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నాడని విమర్శించారు.
ఈ సమావేశంలో తాజద్దీన్, శ్రవణ్ నాయక్, కుర్ర పోచయ్యా, జి డి రమేష్, దన్న సింగ్, అర్ష మల్లేశం, భూమా గౌడ్, గంట శ్రీనివా స్, దండి రవి,అస్తపురం రమేష్,నగేష్ ముది రాజ్, మసుమ్ ఖాన్, మెరాజ్, సిరాజ్, ఖలీ ల్, బషీర్, రాజకుమార్, సుదర్శన్, ఊరడి లత, ముల్కల కవిత, అస్తపురం తిరుమల, షబానా మహమ్మద్, మంజుల తదితరులు పాల్గొన్నారు.