calender_icon.png 12 February, 2025 | 5:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేవుళ్లమీద ఒట్టు ఒట్టిమాటేనా..

12-02-2025 01:08:13 AM

  • కాంగ్రెస్ ఏ పథకాలు అమలు చేయలేదు
  • హర్యానా, ఢిల్లీ ఓటమిపాలయ్యారు
  • బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి
  • కాళేశ్వరం నీళ్లతో సిద్దిపేట ప్రాంతం పంటల హరివిల్లుగా మారింది
  • ప్రమీస్ డే సందర్భంగా సీఎం ఇచ్చిన హామీలు అమలు చేయాలి
  • కోనాయిపల్లి వేంకటేశ్వరుడు కేసీఆర్ సెంటిమెంట్ దేవుడు
  • మాజీ మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట అర్బన్, ఫిబ్రవరి 11: ఎన్నికల్లో దేవుళ్లమీద ఒట్టు పెట్టి అమలు చేయకపోవడం వల్లనే కాంగ్రెస్ పార్టీ హర్యానా, ఢిల్లీలో ఒటమిపాలయ్యిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. మంగళవారం నంగునూరు మండలంలోని కోనాయిపల్లిలో వేంకటేశ్వర ఆలయంలో జరుగుతున్న కళ్యాణోత్సవంలో హరీశ్ రావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ ప్రామిస్ డే రోజున ఇచ్చిన హమీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఇచ్చిన హామిలు అమలు చేయనందుకే ఇతర రాష్ట్రల్లో జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తుచిత్తుగా ఒడగొట్టారని చెప్పారు. రాష్ట్రంలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కొరారు. జనవరి 26కు రైతులందరికి రైతుభరోసా ఇస్తామన్నారు. ఇప్పటి వరకు పూర్తి చేయాలేదన్నారు.

కోనాయిపల్లి వేంకటేశ్వరుడు కేసీఆర్ సెంటిమెంట్ దేవుడని ఏ కార్యం తలపెట్టిన అది ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుందని, తెలంగాణ రాష్ట్రం కోసం ఇక్కడ పూజలు చేశాకే ఉద్యమం ప్రారంభించారని గుర్తు చేశారు. గత ప్రభుత్వ హాయంలో రూ.75కోట్లతో సిద్దిపేట జిల్లాలో దేవాలయాలు నిర్మించమని, కోనాయిపల్లి దేవాలయాన్ని రూ.3.60కోట్లతో అబివృద్ది చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క దేవాలయానికి నిధులు ఇవ్వలేదని విమర్శించారు. బీఆర్‌ఎస్ పార్టీ అమలు చేసిన పథకాలు నిలిపివేశారు కాని కోత్త పథకాలు అమలు చేయడం లేదని మండిపడ్డారు.

రంగనాయక కాలువ వద్ద సెల్ఫీ... 

కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిందని ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీకి వేసవి కాలంలో పారుతున్న రంగనాయక సాగర్ కాలువలు చెంపపెట్టుగా మారాయని హరీశ్ రావు అన్నారు. మంగళవారం చిన్నకోడూర్ మండలంలోని సలేం ద్రి గ్రామంలోని కాలువ వద్ద పారుతున్న నీటిని పరిశీలించి పార్టీ కార్యాకర్తలు, స్థానిక రైతులతో కలిసి సెల్ఫీదిగి సంబురపడ్డారు. కాళేశ్వరం నీళ్లతోనే ఈ ప్రాంతం పంటల హరివీల్లుగా మారిందని హర్షం వ్యక్తం చేశారు.

మెట్పల్లి గ్రామంలో పొద్దుతిరుగుడు పంటను చూసి మూరిసిపోతూ పంట సాగు చేసిన రైతుతో సెల్ఫీదిగారు. అక్కడున్న రైతులతో మాట్లాడి సమస్యలు అడిగితెలుసుకున్నారు. పంటలు సాగు చేసిన రైతులకు గిట్టుబాటు ధర లబించడం లేదని, రాష్ట్ర ప్రభుత్వం వెంటానే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి దాన్యం కొనాలని డిమాండ్ చేశారు. మాజీ సీఎం కేసీఆర్ దూరదృష్టితో కాలువల ద్వారా రైతులకు సాగునీరు అందుతున్నాయని చెప్పారు.