calender_icon.png 2 November, 2024 | 2:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజాపాలనా?.. ప్రతీకార పాలన?

05-07-2024 12:18:04 AM

  • మా ఆఫీస్ ఇటుక కదిపినా గాంధీభవన్‌ను కూలుస్తాం 
  • బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యేలు దాస్యం,పెద్ది హెచ్చరిక

హనుమకొండ, జూలై 4 (విజయక్రాంతి): గత ఎన్నికల్లో ఆరు గార్యంటీలు, 420 హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనా అని చెప్పి ప్రతీకార పాలన కొనసాగిస్తోందని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ విమర్శించారు. బాలసముద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ కేవలం ఆరు నెలల్లోనే ప్రజల్లో వ్యతిరేకతను కూడగట్టుకుందని ఎద్దేవా చేశారు. హామీలు నేరవే ర్చాలని నిలదీస్తున్న బీఆర్‌ఎస్ ప్రజా ప్రతినిధులపై కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తా రు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెడు తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తోందని విరుచుకుపడ్డారు. హామీలు అమ లు చేయలేక కాంగ్రెస్ తర్జనభర్జన పడుతోందన్నారు. 

బీఆర్‌ఎస్ ఆఫీసును కూల్చే కుట్ర

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హనుమకొండ బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చే కుట్ర చేస్తున్నారని, ఒక్క ఇటుక పెళ్ల కదలినా గాంధీభవన్‌ను కూలుస్తామని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి హెచ్చరించారు. గాంధీభవన్, సీపీఐ, సీపీఎం, టీడీపీ తదితర పార్టీల కార్యాలయాలకు భూమిని కేసీఆర్ రాకముందే కేటాయించారని, ఖాదీ బోర్డుకు కేటాయించిన భూమి కూడా ప్రభుత్వభూమి అని గుర్తుచేశారు. బీఆర్‌ఎస్ కార్యాలయాలను టచ్ చేస్తే మీ పార్టీ ఆఫీసులను కూడా టచ్ చేయాల్సి వస్తుందని తీవ్రస్థాయిలో హెచ్చరించారు.