calender_icon.png 14 January, 2025 | 5:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీసుల కోసం మొరం దందా?

14-01-2025 12:41:59 AM

  1. కలిసి వచ్చిన పండుగ సెలవులు 
  2. కామారెడ్డికి కూతవేటు దూరంలోనే తవ్వకాలు

కామారెడ్డి, జనవరి 13 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రానికి కూత వేటు దూరంలో అక్రమ మొరం దందాను కొనసాగిస్తున్నారు. తమ చెరువు నుంచి మొరం తవ్వడం ఏమిటని ప్రశ్నించిన గ్రామస్థులకు పోలీసుల కోసమని చెపుతూ ఎలాంటి అనుమతులు లేకుండా వేలాది ట్రాక్టర్ల మొరాన్ని అక్రమంగా తరలిస్తున్నారు.

ఎస్పీ కార్యాలయానికి, కలెక్టరేట్‌కు కూత వేటు దూరంలోని అడ్లూరు శివారులోని మైసమ్మకుంటలో ఈ దందా సాగుతున్నది. పోలీస్ స్టేషన్‌కు మొరం  తీసుకెళ్తున్నామని అడ్లూరు గ్రామస్థులను నమ్మ  ప్రైవేటుగా అమ్ముకుంటున్నారు. సంక్రాంతి సెలవులు రావడంతో అధికారులు ఎవరూ అందుబాటులో ఉండరని భా  గత నాలుగు రోజులుగా రాత్రింబవళ్లు మొరం తరలిస్తూనే ఉన్నారు.

గ్రామస్థులు అడ్డుకుంటే కామారెడ్డి రూర  సీఐ, దేవునిపల్లి ఎస్సై కార్యాలయాలకు తరలిస్తున్నామని అక్రమార్కులు చెపుతున్నారు. గత నాలుగు రోజులుగా సుమారు వెయ్యి ట్రిప్పుల వరకు మొరం తరలించారు. మొరం తవ్వకాలు చేపట్టడంతో మైసమ్మ కుంట.. బావిని తలపిస్తున్నది. 

కఠిన చర్యలు తీసుకుంటాం

అడ్లూర్ శివారులోని మైసమ్మకుంట నుంచి అక్రమంగా మొరం తరలిస్తున్నారని గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటాం. కుంటలు, చెరువుల్లో నుంచి అక్రమంగా మొరం తరలిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు. 

 జనార్దన్, తహసీల్దార్, కామారెడ్డి

మాకు సంబంధం లేదు

అడ్లూర్ మైసమ్మ కుంట నుంచి పోలీసుల కోసమని తరలిస్తున్న మొరానికి మాకు ఎలాంటి సంబంధం లేదు. మొరం అక్రమంగా తరలించడమే కాకుండా పోలీసుల పేరు చెప్పి తరలించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.

 రామన్, సీఐ, కామారెడ్డి రూరల్