పుట్ట మధును ప్రశ్నించి మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి
రామగిరి, డిసెంబర్ 28 (విజయక్రాంతి) : అతిథులకు మర్యాద చేస్తే నేరమా అని... మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్ పుట్ట మధును ప్రశ్నించారు. లాయర్ జంటల హత్య కేసులో ఎలా నువ్వు తప్పించు కున్నావో నాకు తెలుసనని, నేత్ర చికిత్స అనంతరం పరామర్శించడానికి అదితిగా వచ్చిన వారిని, గౌరవించి వారికి సత్కరించామని, శనివారం ఆయన రామగిరి మండలంలోని శ్రీపాద, ఐఎన్టియుసీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో అన్నారు.
రామగుండం, మంచిర్యాల ఏసీపీలు అధికారికంగా తన ఇంటికి రాలేదని, నాతో సానిత్యంతో అనుబంధంతో రావడం జరిగిందని, నా తల్లి నాకు సంస్కారం నేర్పిందని, అదే సంస్కారంతో ఇంటికి వచ్చిన అదితిని గౌరవించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఇక నుంచి నువ్వు చేసిన అవినీతి అక్రమాలను బయటపెడతానాని ఆయన హెచ్చరించారు.