calender_icon.png 15 November, 2024 | 8:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రంలో పెట్టుబడులకు ‘సైబర్ వ్యూ’ ఆసక్తి

12-11-2024 12:36:08 AM

  1. ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
  2. సెలంగోర్ ప్రావిన్స్ డిప్యూటీ ప్రెసిడెంట్ గణబతిరావు వీరమన్‌తో భేటీ 

హైదరాబాద్, నవంబర్ 11 (విజయక్రాంతి): టెక్నాలజీ హబ్‌ల నిర్మాణం, నూతన పరిశోధనలకు అనువైన వాతావరణం కల్పించడంలో విశేష అనుభవం ఉన్న సైబర్ వ్యూ అనే మలేషియన్ సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కనబర్చిందని మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు.

ప్రస్తుతం మలేషియా పర్యటనలో సందర్భంగా సైబర్ వ్యూ సంస్థ ప్రతినిధులు సోమవారం కౌలాలంపూర్‌లో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాల పట్ల చర్చలు జరిపారు. సమావేశంలో తెలుగు మూలాలున్న సెలంగోర్ ప్రావిన్స్ డిప్యూటీ ప్రెసిడెంట్ గణబతిరావు వీరమన్, హైదరాబాద్‌కు చెందిన టీ సంస్థ చైర్మన్ సందీప్ మక్తల పాల్గొన్నారు.

తెలంగాణలో జరిగిన సాంకేతిక పురోగతులు, డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను స్వయంగా చూసేందుకు గణబతిరావును తెలంగాణకు ఆహ్వానించినట్టు మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు. మలేషియాలో విద్యార్థులకు స్కిల్ డెవలప్‌మెంట్‌లో శిక్షణ ఇచ్చేందుకు సెలంగోర్ ప్రావిన్స్ ప్రభుత్వ ప్రతినిధులకు టీ కన్సల్ట్ సంస్థ మధ్య అంగీకారం కుదిరింది.