20-04-2025 12:00:00 AM
శరీరంలోని ముఖ్యమైన పోషకాలలో ఒకటైన ప్రొటీన్, శరీరం తనను తాను రిపేర్ చేయడంలో ఎంజైమ్‌లు, హార్మో న్‌లను ఉత్పత్తి చేయడంతోపాటు మొత్తం పనితీరును నిర్వహించడానికి సహాయపడుతుంది. ఫిట్‌గా ఉండాలనుకునే వారు ప్రోటీన్ ఎక్కువగా తీసుకుంటారు. ప్రస్తుతం మార్కెట్లో ప్రొటీన్ నూడుల్స్, ప్రొటీన్ కుకీలు, ప్రొటీన్ డెజర్ట్‌లు వంటి అనేక ప్రొటీన్ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. ఇవి కొంత మేర ఆరోగ్యంగా అనిపించినా, ప్రొటీన్లు ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు.
శరీరం రోజువారీ విధులకు 50-175 గ్రాముల ప్రొటీన్ సరిపోతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. బరువు తగ్గాలను కునే వ్యక్తులు సాధారణంగా తమ ఆహారంలో ప్రొటీన్లు ఎక్కువగా తీసుకుంటారు. కాని ఫైబర్, నీళ్లు, విటమిన్లు, ఖనిజాలు కూడా ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి.
ఆరోగ్య సమస్యలు..
శరీరంలో వీటి స్థాయిలు సమతుల్యంగా లేకపోతే, అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. శరీరంలోని ఇతర పోషకాల కంటే ఎక్కువ ప్రొటీన్లను పొందడం వల్ల డీహైడ్రేషన్ సమస్య తలెత్తుతుంది. అదే విధంగా డాక్టర్ సూచన మేరకు ఎంత అవసరమో అంతే తీసుకోవడం ఉత్తమం. తీసుకోవాల్సిన దానికంటే ఎక్కువ ప్రొటీన్ తీసుకోవడం వల్ల శరీర పనితీరు తగ్గుతుంది.