- డీఎస్సీ వాయిదాకు అవకాశాలు నిల్
- రెండింటిలో దేన్ని వాయిదా వేయాలో తెలియక తర్జన భర్జన
హైదరాబాద్, జూలై 6 (విజయక్రాంతి): నిరుద్యోగుల డిమాండ్ మేరకు పోటీ పరీక్షలు వాయిదా వేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే గ్రూప్ వాయిదా వేయాలా? లేకుంటే డీఎస్సీ వాయిదా వేయాలా? అనే అంశంపై సంబంధిత శాఖలతో చర్చోపర్చలు చేస్తోంది. రెండు పరీక్షల్లోనూ గ్రూప్ ప్రభుత్వం వాయిదా వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 18 నుంచి ఆగస్టు 5వ తేదీ డీఎస్సీ జరుగనున్నది. అభ్యర్థులు సీబీటీ ఆన్‌లైన్ విధానంలో పరీక్ష రాయనున్నారు. ఇప్పటికే టీసీఎస్ సంస్థ పరీక్షలకు ఏర్పాట్లు చేస్తోంది. పరీక్షకు సంబంధించిన స్లాట్ బుకింగ్స్ అయిపోతున్నాయి. పరీక్షల షెడ్యూల్ కూడా ఇప్పటికే విడుదలైంది. ఈ నేపథ్యంలో డీఎస్సీని వాయిదా వేసే అవకాశం చాలా తక్కువగా ఉంది.
డీఎస్సీ వాయిదా లేనట్లేనా?
గ్రూప్ పరీక్ష ఆగస్టు 7, 8 తేదీల్లో జరుగనున్నది. డీఎస్సీ జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు జరుగనున్నాయి. ఈ చొప్పున డీఎస్సీకి గ్రూప్ మధ్య ఒకటే రోజే గ్యాప్ ఉంది. డీఎస్సీకి 2.79 లక్షల మంది దరాఖాస్తు చేసుకోగా, వీరిలో లక్ష మంది గ్రూప్స్ కూడా రాస్తారు. ఈ క్రమంలోనే గ్రూప్ లేదా డీఎస్సీని వాయిదా వేయాలని నిరుద్యోగ అభ్యర్థులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. డీఎస్సీని మూడు నెలలు వా యిదా వేయాలని కొందరు కోరుతుంటే, మరికొందరేమో గ్రూప్ డిసెంబర్‌లో నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇ లాంటి సందర్భంలో ఏం చేయాలో తెలియ క అటు రాష్ట్ర విద్యాశాఖ.. ఇటు టీజీపీఎస్సీ అధికారులు తర్జన భర్జన పడుతున్నారు.
ఏ క్షణమైనా వాయిదాపై నిర్ణయం..
ఒకవైపు గ్రూప్ 3 పోస్టులు పెంచడంతో పాటు డీఎస్సీ పోస్టులనూ పెంచి, వాయిదా వేయాలని నిరుద్యోగులు డిమా ండ్ చేస్తున్నారు. ప్రభుత్వం అందుకు అనుకూలంగా తీసుకోకుంటే తమ పోరాటాలను ఉధృతం చేస్తామంటున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి సంబం ధిత అధికారులతో పోస్టులు పెంపు, పరీక్షలు వాయిదాపై సమీక్ష నిర్వహించారు. వి ద్యాశాఖ, టీజీపీఎస్సీ అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. నేడో రేపో సీఎం ఈ అం శంపై మరోసారి అధికారులతో సమావేశమై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఏ క్షణమైనా గ్రూప్ వాయిదా నిర్ణయం వెలువడే అవకాశం కనిపిస్తోంది.