అరెస్టు చేసి జైలుకు పంపిస్తామంటే ఎవరైనా ఏమంటారు? నేను ఏం తప్పు చేసానని అరెస్టు చేస్తారు? అని ప్రశ్నిస్తారు. కానీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ‘నన్ను అరెస్టు చేస్తే చేసుకోండి.. జైలుకు పంపితే పంపుకోండి’ అని అధికార పార్టీకి సవాల్ విసురుతున్నారు. బహుషా జైలుకు పోతే తాను సీఎం అవుతానని అనుకుంటున్నారేమో కాబోలు.
ఎందుకంటే గతంలో జైలుకి వెళ్లిన నాయకులంతా సీఎం అయిన వాళ్లే కదా! వైఎస్ జగన్, చంద్రబాబు నాయడు, రేవంత్‌రెడ్డి కూడా ఒకప్పుడు జైలు జీవితం గడిపిన వారే. తానూ వీరిలాగే జైలుకెళ్తే భవిష్యత్తులో సీఎం అవ్వొచ్చనే అలా మాట్లాడుతున్నారేమోనని టాక్.
జైలులో తాను యోగా చేస్తానని, బయటికొచ్చాక పాదయాత్ర చేస్తానని కేటీఆర్ అందుకే అంటున్నారని జనం గుసగుసలాడుతున్నారు. జైలంటే మన నేతలకు ప్రమోషన్‌కు కేంద్ర బిందువు అయిపోయింది!.