29-04-2025 12:00:00 AM
కేటీపీఎస్ అధికారులను విచారించిన విజిలెన్స్ అధికారులు
భద్రాద్రి కొత్తగూడెం ఏప్రిల్ 27 (విజయక్రాంతి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కే టి పి ఎస్ 5 6 దశల యాష్ పాండు (బోడెద చెరువు) అక్రమ తోలకాలపై జన్కో విజిలెన్స్ అధికారులు కేటీపీఎస్ అధికారులను విచారించినట్టు సమాచారం. శనివారం విజయ క్రాంతిలో వెలువడిన ’యాష్ మాఫియా కు బాధ్యులెవరు’ అనే కథనాలకు స్పందించిన జనకో విజిలెన్స్ అధికారులు కేటీపీఎస్ ఇంజనీర్లను విచారించినట్లు తెలుస్తోంది.
జెన్కో విజిలెన్స్ అధికారుల బృందం సి ఈ, ఎస్ సి ,ఏ డి ఈ స్థాయి అధికారుల ను విచారించినట్టు విశ్వాసనీయంగా తెలుస్తోంది. కేటీపీఎస్ బూడిద చెరువు నుంచి తొలకాలు మార్చి 31కి ముగిసినప్పటికీ ఏప్రిల్ 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు సుమారు రూ 6 లక్షల వరకు బూడిదను అక్రమంగా తరలించారు. దీనిపై ఆరా తీసినట్టు తెలుస్తోంది. ఈ విషయమై కేటీపీఎస్ విజిలెన్స్ కానిస్టేబుల్ మధుకర్ రెడ్డిని వివరణ కోరగా ఆ అంశం డిఎస్పీ పరిధిలో ఉందని సమాధానం ఇచ్చారు