calender_icon.png 14 December, 2024 | 2:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విదేశీ సాయం కొందరికేనా?

14-12-2024 12:14:50 AM

  1. ఓవర్సీస్ స్కాలర్‌షిప్స్ పథకానికి వెల్లువెత్తుతున్న దరఖాస్తులు
  2. అమెరికా, ఫ్రాన్స్, యూకే వంటి అగ్రదేశాల్లో విద్యనభ్యసించే ఛాన్స్
  3. తగినంత బడ్జెట్ లేదంటూ తక్కువ మందిని ఎంపిక చేస్తున్న ఎస్‌ఎల్‌సీ
  4. గతేడాది విద్యార్థులకు ఇప్పటికీ విడుదలకాని రెండోదఫా నిధులు
  5. ఈ యేడాదికి సంబంధించి కొనసాగుతున్న ఎంపిక ప్రక్రియ

చిలువేరు శ్రీకాంత్ :

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 13 (విజయక్రాంతి): ప్రతిభ ఉండి విదేశాల్లో చదువుకోవాలనుకునే నిరుపేద విద్యార్థుల కలలను సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభు త్వం ప్రవేశపెట్టిన ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పథకానికి ఓవైపు విపరీతమైన ఆదరణ (క్రేజ్) పెరుగుతున్నా.. మరోవైపు  ఆయా స్కాలర్‌షిప్‌లకు ఎంపికయ్యేవారి సంఖ్య ఏటా తగ్గుతూ వస్తోంది.

ఉన్నత విద్యాభ్యాసానికి విదేశాలకు వెళ్లే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుపేదల విద్యార్థుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓవర్సీస్ స్కాలర్‌షిప్స్ పేరిట ప్రతి ఏడాది ఉపకార వేతనాన్ని అందిస్తోంది.

2013-14విద్యా సంవత్సరం నుంచి ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి, 2015 నుంచి బీసీ, ఈబీసీ విద్యార్థులకు మహాత్మాజ్యోతిబా పూలే ఓవర్సీస్ విద్యానిధి, మైనార్టీ విద్యార్థులకు 2015 నుంచి చీఫ్ మినిస్టర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్ స్కీం పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఉపకారవేతనం అందిస్తోంది.

ఈ పథకం ద్వారా విదేశాల్లో చదివే ప్రతి విద్యార్థికి రూ.20లక్షల ఆర్థికసహాయంతో పాటు సంబంధిత విద్యార్థి విదే శానికి వెళ్లేందుకు అవసరమైన విమాన ప్ర యాణ ఖర్చులు, వీసా చార్జీలను కూడా చెల్లిస్తోంది. ప్రభుత్వం రెండు దఫాలుగా ఇస్తున్న ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేనందున ఈ ఉపకార వేతనాలకు దరఖాస్తుల సంఖ్య రోజురోజుకూ పెరు గుతోంది.

అయితే ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్న సగం మందికి కూడా ఈ విదేశీ సాయం అందకపోవడం గమనార్హం. దీనికి తోడు 2023-24 సంవత్సరానికి గాను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు రావాల్సిన రెండో దఫా స్కాలర్‌షిప్ ఇంకా రాలేద ని, ఫైనాన్స్‌లో పెండింగ్ ఉందని తెలుస్తోంది. 

విద్యార్థుల ఎంపిక ఎలా..?

ప్రతీ సంవత్సరం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనా ర్టీ సంక్షేమ శాఖల ద్వారా ఈ స్కాలర్‌షిప్స్ లబ్ధిదారుల ఎంపిక కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తోంది. అర్హత గల విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుం ది. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు డిగ్రీ లో 60శాతం మార్కులు, జీఆర్‌ఈ, ఈమ్యాట్‌లో అర్హత సాధించి ఉండాలి, అలాగే ఇంగ్లీష్ ప్రొఫీషియెన్సీ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.

వారి కుటుంబ ఆదాయం రూ.5లక్షలలోపు ఉండాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖలకు వచ్చిన మొత్తం దరఖాస్తులను పరిశీలించి ఆయా విద్యార్థుల మెరిట్ ఆధారంగా ఎస్‌ఎల్‌సీ(స్టేట్ లెవల్ కమిటీ) విదేశీ స్కాలర్‌షిప్స్ కోసం విద్యార్థులను ఎంపిక చేస్తుంది.

హైదరాబాద్ జిల్లాకు సంబంధించి గణాంకాలు..

2013-14 నుంచి ఇప్పటివరకు హైదరాబాద్ జిల్లాలో విదేశీ విద్య పథకానికి ఎస్టీ విద్యార్థులు 67మంది దరఖాస్తు చేసుకోగా 22మందికి రూ.34.5లక్షలు, 535మంది ఎస్సీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా వారిలో 242 మంది విద్యార్థులకు రూ.21.96కోట్లు ప్రభుత్వం సాయం అందించింది. 2016-17 నుంచి ఇప్పటివరకు 1,613మంది బీసీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా..

వారిలో 354మంది విద్యార్థులకు 66.71కోట్లు.. 2015 సవంత్సరం నుంచి ఇప్పటివరకు 7,105 మంది మైనార్టీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా వారిలో 2,436 మంది విద్యార్థులకు రూ.400.23 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించింది. ఈ పథకానికి ఎంపికైన విద్యార్థులకు ప్రయాణ ఖర్చులు, వీసా చార్జీల కోసం కూడా ప్రభు త్వం అదనంగా సాయం అందిస్తోంది. 

సకాలంలో రాకపోవడంతో ఇబ్బందులు

ఓవర్సీస్ స్కాలర్‌షిప్స్ కోసం దరఖాస్తు చేసుకుని ఎంపికైన విద్యార్థులు ఈ ప్రక్రియతో సంబంధం లేకుండానే వారి విద్యా సంస్థ, యూనివర్సిటీ షెడ్యూల్ ప్రకారం చేరాలి. దీంతో పలువురు విద్యార్థులు తమకు ప్రభుత్వం నుంచి సహాయం అందుతుందనే విశ్వాసంతో అక్కడికి వెళ్తున్నారు. 

అక్కడి నుంచి వారు యూనివర్సిటీలో చేరిన సర్టిఫికెట్లు, కట్టిన ఫీజు వివరాలను పరిశీలించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖలు వారికి రెండు విడతల్లో ఉపకార వేతనాన్ని మంజూరు చేస్తారు. అనంతరం ఆ విద్యార్థి చదువుకునే విద్యాసంస్థ నుంచి పొందిన సర్టిఫికెట్, యుటిలైజేషన్ సర్టిఫికెట్లను ఆన్‌లైన్ లో నమోదు చేయించుకుం టారు.

కానీ కొన్ని సందర్భాల్లో ఆయా విద్యార్థుల అవసరాలకు తగ్గట్లుగా ప్రభుత్వం మంజూరు చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారనే ఆరోపణలున్నాయి. కాగా 2023 సం వత్సరానికి చెందిన బకాయిలు కూడా పెం డింగ్‌లో ఉన్నాయని తెలుస్తోంది.

ఇదిలా ఉం డగా ఈ విద్యాసంవత్సరానికి సంబంధించిన దరఖాస్తులను ఎస్సీ, ఎస్టీ, బీసీ శాఖలు ఇప్పటికే స్వీకరించాయి. ఆయా శాఖల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. ఈనెల 1 నుంచి మైనార్టీ శాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 

ఈ దేశాల్లో చదువుకునే వెసులుబాటు

అమెరికా, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, యూకే, సింగపూర్, జపాన్, సౌత్‌కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లోని యూనివర్సిటీల్లో చదువుకునేందుకు ప్రభుత్వం విదేశీ విద్య స్కాలర్‌షిప్ పథకం ద్వారా అవకాశం కల్పిస్తోంది. 2015 నుంచి ఆయా శాఖల ద్వారా విద్యార్థులకు అందించిన విదే శీ విద్యా స్కాలర్‌షిప్‌లను ఓసారి పరిశీలిస్తే.....