calender_icon.png 21 January, 2025 | 10:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంతా మీ ఇష్టమేనా?

21-01-2025 01:18:52 AM

  • పట్టా భూమిలో రోడ్డు వేస్తే బతకాలా? చావాలా?

దేవరకద్ర తహసీల్దార్ కార్యాలయంలో రైతు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం, అడ్డుకున్న తోటి రైతులు

మహబూబ్ నగర్, జనవరి 20 (విజయ క్రాంతి) : అంతా మీ ఇష్టమేనా.... ఎన్ని మార్లు మొరపెట్టుకున్న మమ్మల్ని పట్టించు కోరా.. మా ఆవేదనను పరిగణలోకి తీసుకో కుండా మాకు సంబంధించిన భూమిలో రో డ్డు ఎలా వేస్తారని కంటతడి పెట్టుకుని ఓ రైతు ఆత్మహత్యయత్నానికి పాల్పడిన సంఘ టన దేవరకద్ర మండల తాసిల్దార్ కార్యా లయంలో  సోమవారం చోటుచేసుకుంది.

తాసిల్దార్ ఛాంబర్ లోనే ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడుతుండగా పలువురు రైతులు అడ్డుకుని బయటకు తీసుకువచ్చారు. ఈ విషయంపై రైతు తెలిపి న వివరాలు ఇలా ఉన్నాయి. తన వ్యవసా య పట్టా భూమిలో అక్రమంగా గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు బాట వేస్తున్న అని అడ్డుకున్న తనపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు.

హొ మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండల పరిధిలోని చౌదర్ పల్లి గ్రామానికి చెందిన కంపిలి రామకష్ణ అనే రైతుకు గ్రామ శివారులో సర్వేనెంబర్ 88లో 6.6 ఎకరాలపట్ట భూమి ఉంది. అతని పొలం పైనుంచి ఇతర పొలాలకు రైతులు వెళ్లేందుకు బాట కావాలని గ్రామానికి సంబంధించిన అధికార పార్టీ నాయకులు, రైతులు కొంతమంది నాయకులు కలిసి తన అనుమతి లేకుండాహొ రైతులు తన భూమి లో మట్టి పోసి రోడ్డు వేసేందుకు గత కొన్ని రోజుల మంచి ప్రయత్నం చేస్తున్నారని ఆస న్న వ్యక్తం చేశారు.

తాను రోడ్డు వేయకుండా అడ్డుకున్నాని, దీంతో నా పై భౌతిక దాడి చే యడంతో తనకు న్యాయం చేయాలని పోలీ సులకు రెవెన్యూ అధికారులకు విన్నవించిన ఎలాంటి స్పందన లేదన్నారు. దీంతో తిరిగి సోమవారం తన పొలంలో మట్టి రోడ్డు వే సేందుకు మట్టిపొస్తున్న రానే అనే విషయం తెలుసుకుని నా భార్య అరుణతో కలిసి పొలం దగ్గరికి వెళ్ళాను. దీంతో కొంతమంది అక్కడ ఉన్నటువంటి రైతులు నా పై దాడికి ప్రయత్నించగాహొ తప్పించుకుని దేవరకద్ర తాసిల్దార్ కార్యాలయానికి చేరుకున్నాను.

దీంతో ఏం చేయాలో తెలియక వెంట డబ్బాలో పెట్రోల్ తీసుకుని వచ్చి నేరుగా తాసిల్దార్ ఛాంబర్ లో వెళ్లి తనకు న్యాయం జరగడం లేదని ఆందోళన చేస్తూ ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాను. అక్కడే కొంతమం ది రైతులు గ్రహించి బయటికి పెట్రోల్ డబ్బాతో పాటు అతన్ని తీసుకెళ్లారు. ఈ సందర్భంగా రైతు తాసిల్దార్ కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు.

అనంతరం తాసిల్దార్ కార్యాలయంలో తాసి ల్దార్ కష్ణయ్య రైతులు దగ్గర వివరాలు సేక రించగా తన పొలంలో అనుమతి లేకుండా పట్ట భూమిలో రైతు అనుమతి లేకుండా రైతుల కోసం రోడ్డు వేయడం ఎంతవరకు న్యాయమని ఆందోళన చేశారు.

హొ దీంతో స్పందించిన తహసిల్దార్ కష్ణయ్య మాట్లాడు తూ త్వరలోహొ గ్రామానికి వచ్చి గ్రామం లో పొలం దగ్గర పరిశీలించిహొ రైతుకు తప్పకుండా న్యాయం చేస్తానని హామీ ఇవ్వ డంతో రైతు రామకష్ణ ఆందోళన విరమిం చాడు. తమకు న్యాయం చేయాలని తాసి ల్దార్‌ను కోరారు.