విద్యార్థులకు మెరుగైన చికిత్స అందిస్తున్నాం
హరీశ్ రాజకీయం చేయడం సరికాదు: మంత్రి సీతక్క
హైదరాబాద్, నవంబర్ 5 (విజయ క్రాంతి): ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనపై రాజకీయాలు చేయడం మానుకోవాలని మంత్రి సీతక్క హితవు పలికారు. ఫుడ్ పాయిజన్‌తో అనారోగ్యం బారి న పడిన విద్యార్థులను ప్రభుత్వం పట్టించుకోలేదన్న మాజీ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్య లను మంగళవారం ఒక ప్రకటనలో ఖండించారు. బాధితులకు మెరుగైన వైద్యం అం దిస్తున్నామని తెలిపారు.
తానే స్వయంగా ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తాలతో సమన్వయం చేసుకుంటూ విద్యార్థులకు ఎలాంటి అపాయం జరగకుండా చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నా రు.ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకే హెల్త్ మానిటరింగ్ యాప్‌ను అందు బాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు. ఫుడ్ పాయిజన్‌కు గురైన విద్యార్థునులకు మెరుగైన వైద్యం అందించేందుకే హైదరాబాద్ లోని నిమ్స్‌కు తరలించామని,
వారి వైద్య ఖర్చులతోపాటు రహదారి ఖర్చులు పూర్తిగా ప్రభుత్వమే చెల్లించనున్నట్టు స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటు న్నా ఫుడ్ పాయిజన్ ఘటనపై హరీశ్‌రావు రాజకీయాలు చేయడం సరికాదని విమర్శించారు.
బీఆర్‌ఎస్ హయాంలో వందల ఫుడ్ పాయిజన్ ఘటనలు జరిగి వేలాది మంది విద్యార్థులు ఆనారోగ్యం పాలైనా పట్టించుకోలేదని ఆగ్రహించారు. గురుకులాల్లో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనపై గతంలో హైకోర్టు కూడా విచారణ జరిపిందని గుర్తుచేశారు.