calender_icon.png 16 March, 2025 | 11:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి అంతా మాటలకేనా!

16-02-2025 12:00:00 AM

ఒక రాష్ట్రం, లేదా ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఆ ప్రాం తంలో మౌలిక వసతులు ఏర్పాటు అత్యం త కీలకం. రైతులు పండించే పంటలను సరైన ధరకు విక్రయించుకోవడానికి వీలు గా మార్కెట్ల అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పన ప్రభుత్వ ధ్యేయం కావాలి.

ఆ తర్వాత ఆ ప్రాంతంలోని సహజవనరుల సద్వినియోగం మరో ప్రాధాన్యతగా ఉండాలి.  అందుకు మానవ వనరులను పెంపొందించుకోవడం మరో ముఖ్యమైన అంశం. ఇన్నేళ్ల కాలంలో  ఈ మూడు ముఖ్య అంశాలూ ఉత్తర తెలంగాణ జిల్లాలు తీవ్రనిర్లక్ష్యానికి గురయ్యాయి. 

వనరులు పుష్కలం

వాస్తవంగా చెప్పాలంటే ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామా బాద్, కరీంనగర్ జిల్లాల్లో అభివృద్ధికి అవసరమైన వనరులు పుష్కలంగా ఉన్నాయి. అడవులు, ఖనిజసంపద, పంట భూములకు కొదువ లేదు. సాగు, తాగునీరు కల్పించేందుకు అవకాశాలు మెండుగానే ఉన్నాయి.

అంతేకాదు మన అవసరాలు తీర్చడమే కాకుండా పక్క రాష్ట్రాలను ఆదుకునేంత వర్షపాతం, నీటి వనరులు ఉత్తర తెలంగాణ జిల్లాల సొంతం. కానీ వీటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలియని స్థితిలో ప్రభుత్వ వ్యవస్థలు ఉన్నా యి. రాష్ట్ర అభివృద్ధిలో వ్యవసాయ రం గం, భూ పంపిణీ కూడా కీలకం ఈ రెండు చర్యలు ఫలప్రదంగా అమలు చేస్తే ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది.

వ్యవసాయ రంగంలో సరైన దిగుబడులు రాక, ఇతర ఉపాధి అవకాశాలు లేక ప్రజల్లో కొనుగో లు శక్తి తగ్గింది. గ్రామీణ ప్రాంతాల్లో నేడు 50 శాతం ప్రజల చేతిలో సెంటు భూమికూడా లేదు. భూ పంపిణీ పథకం కింద వేల ఎకరాల భూములు పంచినట్లు ప్రభు త్వ నివేదికల్లో ఉన్నా... ఆ మొత్తం భూమి సంబంధిత లబ్ధిదారుల చేతుల్లో కాకుండా  బినామీ రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్లి పోయింది.

స్థానికంగా ఉపాధి కల్పన కోసం చేపట్టాల్సిన చిన్న తరహా, కుటీర పరిశ్రమలూ పెద్దగా నెలకొల్పబడలేదు. సాగునీటి వనరులు లేక వర్షంపై ఆధారపడిన ఉత్తర తెలంగాణాను పరిశీలిస్తే అది లాబాద్ జిల్లాలో 20లక్షల ఎకరాలు సాగుభూమి కాగా 1.40లక్షల ఎకరాలకు మాత్ర మే కాలువల ద్వారా నీరు అందుతున్నది.

నిజామాబాద్‌లో 13లక్షల ఎకరాలు సాగులో ఉన్నప్పటికీ భారీ ప్రాజెక్టుల ద్వారా 3లక్షల ఎకరాలు, మధ్య తరహా ప్రాజెక్టుల ద్వారా 24వేల ఎకరాలకు మాత్రమే నీరు ఇస్తున్నారు.

కరీంనగర్ జిల్లాలో 19లక్షల ఎకరాలు విస్తీర్ణం ఉండ గా శ్రీరాం సాగర్ ప్రాజెక్టు ద్వారా 5.50లక్షల ఎకరాలకు నీరు ఇస్తున్నారు. చెరువుల కింద మరో 1లక్ష ఎకరాల ఆయకట్టు ఉం ది. ఈ మూడు జిల్లాలో ప్రకృతి సిద్ధంగా నీటి లభ్యత పుష్కలంగా ఉన్నప్పటికీ నీటి నిల్వ వనరులు లేకపోవడం గమనార్హం.

వైద్య సదుపాయాలు దారుణం

వైద్య, ఆరోగ్య రంగాల పరిస్థితి అత్యంత హృదయ విదారకం. మలేరియా లాంటి జబ్బులతో ఏటా దాదాపు 3 వేల మంది మరణిస్తున్నారు. అందులో మెజార్టీ ప్రజ లు గిరిజనులే. వీరికి తమ గ్రామాల నుం డి వైద్య సౌకర్యం కోసం పట్టణాలకు రావడానికి రహదారులు ఉండని పరిస్థితి. ఒక్కోసారి డోలీల్లో రోగులను మైళ్లదూరం మోసుకుని తీసుకు రావాల్సిన పరిస్థితి.

అలాంటి పరిస్థితుల్లో ఆస్పత్రికి చేరే సమయానికే పరిస్థితి చేయి దాటిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.  ముఖ్యంగా నెలలు నిండిన మహిళలను కాన్పు కోసం ఆస్పత్రికి తీసుకురావడం గగనమే.

కాగా ప్రభుత్వ హెల్త్ సెంటర్స్, దవాఖానాల్లో డాక్టర్లు, మందులు లేని దుస్థితి కొనసాగుతున్నది. పేరుకే పెద్ద హాస్పిటల్స్, సేవలు ఉండవు. చిన్న చిన్న జబ్బులకే పరిస్థితి సీరియస్ అంటూ నిరుపేద పేషెంట్లను హైద రాబాద్‌కు తరలించడం మామూలైంది.  

రాష్ట్రంలోనే డ్రాపౌట్లు అత్యధికం

విద్యా రంగంలో ఈ ప్రాంతం అత్యంత వెనుకబడి ఉంది. భారతదేశ అక్షరాస్యత 74 శాతం ఉండగా, తెలంగాణ అక్షరాస్యత 66.54 శాతంగా ఉంది. ఉత్తర తెలంగాణాలో 50-60 శాతం మధ్య అక్షరాస్యత ఉంది. దళిత, గిరిజనులు,  బాలికల విద్య లో 40 శాతం దాటి లేదంటే అతిశయోక్తి కాదు.

10వ తరగతి వరకు డ్రాపౌట్లు రాష్ట్రంలో 21 శాతం ఉండగా ఉత్తర తెలంగాణలో అత్యధికంగా డ్రాపౌట్స్ 40 శాతంగా ఉన్నాయి. ఇందులో ఇంటర్ చదివే వరకు దాదాపుగా 60 శాతం డ్రాపౌట్స్ ఉంటున్నాయి. ఉన్న విశ్వవిద్యాలయాలు  ఉద్యోగుల కొరతతో పాటు నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతున్నాయి. మెరుగైన రవాణా వ్యవస్థ ఉంటే పెట్టుబడులను ఆకర్షించడానికి వీలవుతుంది.

రవాణా లేని ప్రాంతాలు ఏనాడూ అభివృద్ధి కావు. రహదారులు, రైలు, విమాన మార్గాలు రాష్ట్ర అభివృద్ధిలో కీలక భూమి క పోషిస్తాయి. పరిశ్రమల ఏర్పాటు, తద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతా యి. నేటికీ ఉత్తర తెలంగాణలో వందలాది గ్రామాలు, గిరిజన తండాలు, గోండు గూడేలకు సరైన రహదారులు లేవు.

జబ్బు చేస్తే ఆసుపత్రికి వెళ్లడానికీ నానా అవస్థలు పడాల్సి వస్తోంది. అక్కడ వాగు లు, వంకలు దాటేందుకు చాలా చోట్ల కల్వర్టులు కూడ లేవు. 77 ఏళ్ల స్వతంత్య్ర చరిత్ర లోనూ ‘పల్లె వెలుగు’ (ఆర్టీసీ బస్సు) ఎరుగని పల్లెలు వందల్లోనే ఉంటాయి. జిల్లా ముఖ్య పట్టణాలకు రైల్వే స్టేషన్లు ఉన్నప్పటికీ రైళ్ల రవాణా మాత్రం అంతంత మాత్రమే. రైల్వేలైన్ల అభివృద్ధి - విస్తరణ, విమానయానంలోనూ భారీ నిర్లక్ష్యం  కొనసాగుతూనే ఉంది. 

బీడీ కార్మికుల పట్ల నిర్లక్ష్యం

ఉత్తర తెలంగాణకు చెందిన సుమారు 10 లక్షలమంది కార్మికులు గల్ఫ్‌లో పనిచేస్తున్నారు. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయనే  కోటి ఆశలు, ఆకాంక్షలతో ఎదురు చూసిన తెలంగాణ యువతకు నిరాశే మిగిలింది. ఏజెంట్ల మోసం, అక్కడి కంపెనీల మోసం వల్ల వందలాది మంది గల్ఫ్ దేశాల్లోనే తమ తనువులను కోల్పోతున్న సంఘటన కోకోల్లలు.

ఉత్తర తెలంగాణలో బీడీలు చుట్టడం  ప్రముఖ చిన్న తరహా పరిశ్రమ. ఇందులో సుమారు 8 లక్షల మందికి పైగా మహిళలు పనిచేస్తున్నారు. బీడీలు చుట్ట డం శ్రమతో కూడుకున్న పని అయినప్పటికీ ఇతర జీవనాధారం లేకపోవడంతో మహిళలు అదే వృత్తిగా చేసుకుని బతుకు బండిని లాగుతున్నారు.

బీడీలు చుట్టడం వల్ల వేలాది మంది మహిళలు వివిధ రకా ల జబ్బులతో  యవ్వన దశలోనే తనువు లు చాలిస్తున్నారు.  వాళ్ల బాగోగులను పట్టించుకునే ప్రభుత్వ యంత్రాంగం లేకపోవడం గమనార్హం.

అన్నింటికీ మించి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలోను ఉత్తర తెలంగాణ నుంచి కేవ లం ఇద్దరికి మాత్రమే  మంత్రి పదవులు లభించడం మనకి తెలిసిందే. అనాదిగా నిర్లక్ష్యానికి గురవుతున్న ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి, కాకా వెంకటస్వామి కుటుం బం లేదాప్రేమ్ సాగర్‌లలో ఒక్కరికీ కూడ మొదటి విడుత మంత్రివర్గంలో స్థానం దక్కలేదు.

అలాగే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోను సీనియర్ కాంగ్రెస్ నేతగా ఆ జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న సుదర్శన రెడ్డికి సైతం మొండి చెయ్యి ఆడిస్తూనే ఉన్నారు. అటు అభివృద్ధి విస్తరణలోను, ఇటు మంత్రివర్గ విస్తరణలోను  న్యాయం చేయలేకపోవడాన్ని సాక్షాత్తు కాంగ్రెస్ వాదులే నామోషిగా ఫీల్ అవుతున్నారు.

తమ ఆశలు ఆకాంక్షాలు నెరవేస్తారని నమ్మకంతో  కేసీఆర్ ప్రభుత్వాన్ని కాదని, రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. ప్రాంతీయ మనోభావాలను మన్నించి, వివక్ష-అంతరాలు లేకుండా, అభివృద్ధి సమవర్తిగా వ్యవహరించడం పాలక-,విపక్షాల బాధ్యత అని గుర్తెరిగి ముందుకెళ్లాలని ఆశిద్దాం.

 వ్యాసకర్త సెల్: 85010 61659