calender_icon.png 30 September, 2024 | 5:01 PM

పత్తికి గిట్టుబాటు ధర లభించేనా?

30-09-2024 02:13:32 AM

  1. ఖమ్మం జిల్లాలో 1.99లక్షల ఎకరాల్లో సాగు
  2. 1.79లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి 
  3. 5 సీసీ కేంద్రాలు, 10 జిన్నింగ్ మిల్లుల్లో కొనుగోళ్లు

ఖమ్మం, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): వానాకాలంలో సీజన్‌లో సాగు చేసిన పత్తికి గిట్టుబాటు ధర దక్కుతుందో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 1,99,700 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. 1,79,730 మెట్రిక్ టన్నుల పత్తి దిగుబడి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

అయితే ఈసారి దిగుబడి తగ్గిన కారణంగా గిట్టుబాటు  ధర ఆశాజనకంగా ఉంటుందనే ఆశతో రైతులు ఉన్నారు. అధికారులు పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు సమాయత్తం అవుతున్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 5 సీసీ కేంద్రాలు, 10 జిన్నింగ్  మిల్లుల్లో కొనుగోలు కేంద్రాలు  ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి రకానికి క్వింటాలుకు రూ.7,521, మధ్య రకానికి రూ.7,121ల మద్దతు ధర చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.  అక్టోబర్ రెండో వారం నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభంకానున్నాయి.