calender_icon.png 29 April, 2025 | 10:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలనా?

29-04-2025 01:30:17 AM

పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు 

హైదరాబాద్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ నుంచి ఆపార్టీ నాయకు లు, ఎమ్మెల్యేలు వెళ్లిపోతారనే భయం కేసీఆర్‌కు పట్టుకున్నదని, అందుకే తప్పుల మీద తప్పులు చేస్తున్నారని పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు విమర్శించారు.

తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ విల న్ అయ్యిందా..? అని ప్రశ్నించారు. సోమవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇవ్వకపోతే నాంపల్లి దర్గా దగ్గర కేసీఆర్ కుటుంబం అడుక్కునేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం సోనియాగాంధీ వద్దకు వెళ్లిన విషయం మర్చిపోవద్దన్నారు.