calender_icon.png 20 January, 2025 | 2:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్‌ఎస్ దూరం?

20-01-2025 12:10:36 AM

కరీంనగర్, జనవరి 19 (విజయక్రాంతి): కరీంనగర్-మెదక్-నిజామాబాద్- ఆదిలా బాద్ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ అభ్యర్థిని ఇప్పటికే బీజేపీ, బీఎస్సీ పార్టీలు ప్రకటించాయి. కాంగ్రెస్ పార్టీ నేడో, రేపో ప్రకటించే అవకాశం ఉంది. ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీ మాత్రం ఇప్పటి వరకు అభ్య ర్థులను ప్రకటించే దిశగా ముందడుగు వేయడం లేదు.

గత ఎన్నికల్లో బయట నుం డి మద్దతు ప్రకటించిన బీఆర్‌ఎస్ ఈసారి ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించి నట్లు తెలుస్తోంది. దీంతో ఆ పార్టీ టికెట్ పై ఆశలు పెంచుకున్న నేతలు అయోమ యంలో పడ్డారు.

బీఆర్‌ఎస్ నుండి కరీంనగ ర్ మాజీ మేయర్, పౌరసరఫరాల సంస్థ మాజీ చైర్మన్ సర్దార్ రవీందరిసింగ్, కరీంన గర్కు చెందిన డాక్టర్ బీఎన్రావు టికెట్ ఆశ లో ఉండగా, రవీందర్ సింగ్ ఒక అడుగు ముందుకు వేసి బీఆర్‌ఎస్ నేతల ఫోటోలతో నాలుగు ఉమ్మడి జిల్లాల్లో ఫ్లెక్సీలను ఏర్పా టు చేసి ప్రచారాన్ని ముమ్మరం చేశారు.

మొదట పార్టీ అధినేత కేసీ ఆర్ రవీందర్ సింగ్ భుజంతట్టినప్పటికీ ప్రస్తుతం మౌనం గా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రచారం చేసుకుం టున్నాను కనుక మీ ఆశీ స్సులు ఉంటే గెలిచి వస్తా నని కేసీఆర్ తోటు కేటీ ఆర్, హరీశ్రరావు, బీఆర్‌ఎస్ నేతలతో రవీందరిసింగ్ చెప్పినట్లు తెలిసింది.

తెలంగాణ ఉద్యమ సమయంలో, తెలంగాణ ఆవిర్భావం తర్వాత జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులు ఆర్ సత్యనా రాయణ, స్వామిగౌడ్, నారవాసు లక్ష్మమ్రా వులు వరుసగా విజయం సాధించారు. 2019లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్కు బయట నుండి మద్దతు ప్రకటించింది.

అప్పుడు అధికారంలో ఉండి కూడా అభ్యర్థిని నిలబెట్ట కపోవడంతో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించారు. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న ఆ పార్టీ అభ్యర్థు లను నిలబెట్టడులో వెనుకడుగు చేస్తుందడం తో పార్టీ క్యాడర్ కూడా అసంతప్తి నెలకొం ది. కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన తర్వాత కాంగ్రె స్, బీజేపీ, బీఎస్పీ అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేయనున్నారు.- 

ప్రసన్న పయనమెటు?

ఆసిస్టెంట్ ప్రొఫెసర్ పదవికి రాజీనామా చేసి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచేందుకు నిర్ణయించుకున్న ప్రసన్న హరికష్ణ పయమనమెటు అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ టికెట్నరేందర్ రెడ్డికే ఖాయమన్న ప్రచారం జరుగు తుండడంతో ప్రసన్న హరికష్ణ పోటీలో ఉంటారా లేక పోటీలో ఉండి బీఆర్‌ఎస్ మద్దకు కోరకారా వేచి చూడాల్సి ఉంది. ఇదిలా ఉండి బీసీ సామాజికవర్గానికి చెందిన హరికష్ణకు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.