calender_icon.png 15 November, 2024 | 9:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కులగణనకు బీజేపీ అనుకూలమా.. కాదా ?: మంత్రి పొన్నం

09-11-2024 04:19:54 PM

కేటీఆర్, హరీశ్ ను అరెస్ట్ చేస్తామని మేం అనలేదు

హైదరాబాద్: బీజేపీ.. ఎస్సీ, ఎస్టీ, బీసీల వ్యతిరేక పార్టీ అని కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. మంత్రి శనివారం నాడు మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ నేతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో ముగ్గురు ఐఏఎస్ లే కార్యదర్శులుగా ఉన్నారు. కులగణనలో వివరాలు సేకరించి గోప్యంగా ఉంచుతామన్నారు. కులగణనకు బీజేపీ అనుకూలమా.. కాదా అని మంత్రి పొన్నం ప్రశ్నించారు. తెలంగాణలో సర్వేపై లక్ష్మణ్ అభిప్రాయం చెప్పాలని కోరారు. సర్వేను అడ్డుకోవాలని చూస్తే ద్రోహులుగా మిగులుతారని హెచ్చరించారు. బీజేపీ నేతల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బీఆర్ఎస్ సర్వే చేపట్టలేక పోయిందని మంత్రి పొన్నం తెలిపారు. హైదరాబాద్ కు కిషన్ రెడ్డి ఏం చేశారో చర్చకు సిద్ధమా? అని ప్రశ్నించారు. కేటీఆర్, హరీశ్ రావును అరెస్టు చేస్తామని తాము అనలేదని స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములుగా ఉండకపోతే.. చరిత్ర హీనులుగా మిగిలిపోతారని మంత్రి పొన్నం వ్యాఖ్యానించారు.