- హత్యలకూ మత్తు పదార్థాల వినియోగం!
- చోద్యం చూస్తున్న కందనూలు ఎక్సైజ్ అధికారులు
- నాగర్‌కర్నూల్, నవంబర్ 30 (విజయక్రాంతి): అధికారుల నిర్లక్ష్యంతో అల్ప్రోజోలం, క్లోరోహైడ్రైడ్, డైజోఫామ్ లాంటి నిషేదిత మత్తు పదార్థాలు అంగట్లో సరుకుల్లా సులువుగా దొరుకుతున్నాయి. చెట్టు కల్లు పేరుతో కృత్రిమ కల్తీ కల్లు తయారీ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కల్లు వ్యాపారులే.. మత్తుపదార్థాలను విక్రయిస్తూ హత్యా కాండకు పురిగొల్పుతున్నట్టు తెలు స్తోంది.
- నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి ఎంపీడీవో కార్యాలయం అటెండర్ జగదీశ్ హత్య కేసులో నిందితులు ప్రమాదకర అల్ప్రో జోలంను వినియోగించినట్టు పోలీసు విచారణలో బయటపడటం కలకలం రేపు తోంది. హత్యకేసులో అసలు సూత్రధారిని చాకచక్యంగా తప్పించి కల్తీకల్లు మాఫియా గుట్టు బయటపడకుండా కొందరు అధికా రులు, నాయకులు తెరవెనుక చక్రం తిప్పారని తెలుస్తోంది. ఇంతజరుగుతున్నా నాగర్‌కర్నూల్ ఎక్సైజ్ అధికారులు పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. హత్యకేసు కూడా నీరుగారే అవకాశం లేకపోలేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కల్తీ కల్లు తయారుదారిని తప్పించిన అధికారులు?
ఇటీవల భర్తను ప్రియుడు, కుటుంబ సభ్యుల సహకారంతో హతమార్చిన ఓ భార్యకు మద్దతుగా ఓ కల్తీ కల్లువ్యాపారి తన వ్యాపారబుద్ధిని వినియో గించాడు. హత్యను ఆత్మహత్యగా మార్చేం దుకు మత్తుపదార్థం బాగా పనికొస్తుందని భావించి, కల్తీకల్లుకు వినియోగించే క్లోరోహై డ్రైడ్‌ను విక్రయిం చాడు. హత్యకు ప్రధాన సూత్రధారి అయినా కేసులో మాత్రం ఎ నమోదు చేయడం ఆరోపణలకు బలం చేకూరుస్తోంది.
జిల్లాలో కల్తీకల్లు తయారీ కోసం వినియోగించే క్లోరోహైడ్రైడ్ వ్యాపారం కోట్లలో జరుగు తోందని, దాని గుట్టు బయటపడుతుందనే భయంతోనే పోలీసులు సదరు వ్యక్తి పరారీలో ఉన్నట్టు చూపారన్న ఆరోపణలు ఉన్నాయి.