02-03-2025 12:00:00 AM
ప్రతి ఒక్కరూ పొడవాటి, దృఢమైన, నల్లటి జుట్టును కోరుకుంటారు. జుట్టు పెరుగుదలకు అనేక రకాల షాంపూలు, కండీషనర్లు, హెయిర్ ఆయిల్స్ వాడుతుంటారు. అలాంటి ఒక హెయిర్ ఆయిల్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. దానిపేరే ఆదివాసీ హెయిర్ ఆయిల్. ఈ నూనె కర్నాటకలోని గిరిజన ప్రాంతాల నుంచి వస్తోంది.
చాలామంది దీని గురించి తెలుసుకోవడం ప్రారంభించారు. చాలామంది ప్రముఖులు కూడా ఈ ఆయిల్‌ను ప్రమోట్ చేస్తున్నారు. ఈ నూనె జుట్టు పెరుగుదలకు మాత్రమే కాకుండా జుట్టులేని వారి తలపై కూడా జుట్టు పెంచుతుందని కూడా చెబుతున్నారు. కర్నాటక అటవీ ప్రాంతాలలో జంతువులను, పక్షులను వేటాడే హక్కిపక్కి గిరిజన తెగ ఉంది.
ఇది కర్నాటకలోని షెడ్యూల్డ్ తెగ. వన్యప్రాణుల చట్టాల కారణంగా వేట నిషేధించినప్పటి నుంచి అక్కడి గిరిజనులు సహజ పదార్థాలతో అనేక వస్తువులను తయారు చేయడం ప్రారంభించారు. వాటిలో ఒకటి గిరిజన హెయిర్ ఆయిల్. సహజ పదార్థాలతో తయారు చేయడం వల్ల దీని గురించి చర్చ మొదలైంది. ప్రస్తుతం చాలామంది ఈ ఆయిల్‌ను విక్రయిస్తున్నారు.
పూర్వీకులు ఐదు తరాలకు పైగా ఈ నూనెను ఇంట్లోనే తయారు చేసుకుంటున్నారని అంటున్నారు. నూనెలో పారాబెన్‌లు, సిలికాన్‌లు లేదా పారాఫిన్‌లు ఉండవు. ఈ నూనె చుండ్రును తొలగించడంలో, జుట్టును బలోపేతం చేయడంలో, బట్టతల ఉన్నవారి తలపై జుట్టు పెంచడంలో, జుట్టు రాలడాన్ని నివారించడంలో ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు. ఆదివాసీ హెయిర్ ఆయిల్ తయారీలో 108 పదార్థాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు.