calender_icon.png 30 April, 2025 | 7:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిరిజన ఎమ్మెల్యే అంటే అంత లోకువా?

30-04-2025 12:51:12 AM

  1. ఎమ్మెల్యే లేడనుకున్నారా

నా నియోజకవర్గంలో నాకు తెలియకుండా అభివృద్ధి పనులు చేపట్టడమేంటి?

అధికారులపై ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఫైర్

అశ్వారావుపేట, ఏప్రియల్ 29, (విజయ క్రాంతి) :భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావు పేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అధికా రుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్మపేట మండలంలో  మంగళవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణతో కలిసి షెడ్యూల్ ప్రకారం పలు అభివృద్ధి పనులను ప్రారంభించాల్సి ఉంది.

అయితే షెడ్యూల్లో  పొందు పరచని రూ.15 కోట్ల వ్యయంతో 10 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణ పనుల శంకు స్థాపనకు  ఆర్ అండ్ బీ అధికారులు ఏర్పాట్లు చేశారు. కానీ తనకు తెలి యకుండానే రోడ్డు శంకుస్థాపన కార్యక్ర మాన్ని ఏర్పాటు చేయడంతో అధికారులపై జారె తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే లే డ నుకున్నారా, గిరిజన ఎమ్మెల్యే పిచ్చోడిలా కనిపిస్తు న్నాడా..? అని  అధికారులను నిలదీశారు.

తన నియోజకవర్గంలో తనకు  తెలియకుండానే అభివృద్ధి పనులను ఎలా ప్రారంభిస్తారు’ అని ఫైర్ అయ్యారు. మంత్రి తుమ్మల అంటే తనకు గౌరవం ఉందని.  కానీ అధికారులు తనని అవమానించేలా వ్యవహరించడంతో తన మనో భావాలు దెబ్బతిన్నాయన్నారు.

పర్యటన నుంచి తిరిగి వెళ్లిపోతానని ఎమ్మెల్యే జారె తెగేసి చెప్పారు. దీంతో మంత్రి తుమ్మల కలుగజేసుకొని అధికా రులు ఎమ్మెల్యేకి సమాచారం అందించక పోవడం వారి తప్పేనని, దీనిపై తర్వాత చర్చిద్దామని సముదాయించారు. . జారెను మంత్రి తుమ్మల తన కారులో కూర్చోబె ట్టుకుని తీసుకువెళ్లారు. దీంతో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయకుండానే పర్యటన ముందుకు సాగింది.