calender_icon.png 31 October, 2024 | 9:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులకు సాగునీటిని అందించాలి

30-07-2024 02:19:25 AM

  1. మల్లన్నసాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్లను నీటితో నింపాలి
  2. ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి

గజ్వేల్, జూలై 29: మల్లన్నసాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్లను నీటితో నింపి కెనా ల్‌ల ద్వారా రైతులకు సాగునీటిని అందించాలని ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతా ప్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాల యంలో మీడియాతో మాట్లాడుతూ.. గత కేసీఆర్ ప్రభుత్వం రైతులకు సాగునీరు అం దించడానికి నిర్మించిన ప్రాజెక్టులను, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వినియోగించకుండా నిర్వీర్యం చేస్తోందని, ఫలితంగా ఇంకా పలుచోట్ల రైతులు నాట్లు వేయకుండా సాగునీటి కోసం ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. నీరందించని పక్షంలో ఆగస్టు 2న రాజీవ్ రహదారి, తూప్రాన్ జాతీయ రహదారులను అన్ని నియోజకవర్గాల రైతులతో కలిసి దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్‌సీ రాజమౌళి, వైస్ చైర్మన్ జకియోద్దీన్, పంగ మల్లేశం, నవాజ్‌మీరా, మాదాసు శ్రీనివాస్  పాల్గొన్నారు.