calender_icon.png 10 January, 2025 | 3:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాగు నీటి కొరత రాకుండా చూడాలి

09-01-2025 12:00:00 AM

  1. ప్రభుత్వ విప్ లక్ష్మణ్‌కుమార్
  2. సాగునీటి ఎద్దడి విషయంలో సమీక్ష సమావేశం 

జగిత్యాల, జనవరి 8 (విజయ క్రాంతి): జగిత్యాల జిల్లా వ్యాప్తంగా రైతులకు సాగు నీటి ఇబ్బంది రాకుండా వెంటనే కట్టుది ట్టమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్’కుమార్ సూచించారు. కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం జిల్లా సూపరిండెంటింగ్ ఇంజనీర్, ఎస్సారెస్పీ డీఈలు, విద్యుత్ శాఖ అధికారులతో కలెక్టర్ సత్యప్రసాద్’తో పాటూ లక్ష్మణ్’కుమార్ సమీక్ష నిర్వహిం చారు.

నీటి పారుదల శాఖ అధికారులతో జరిగిన సమీక్షలో ఉన్న నీటి వనరులు, వాటి వినియోగం, లోటుపాట్ల గురించి చర్చించా రు. ప్రాజెక్టుల నుంచి సాగునీటి విడుదల, నీటి నిల్వలు, పంట కాల్వల అవసరాలు తదితర అంశాలపై అధికారులను పూర్తి వివ రాలు అడిగి తెలుసుకొని తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా అడ్లూరి మాట్లాడు తూ జిల్లా రైతులు సాగు నీటి కొరతతో ఇబ్బంది పడకుండా తక్షణ చర్యలు తీసుకో వాలని పేర్కొన్నారు.

జిల్లాలో ప్రతి రైతుకు సాగు నీరు అందించేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయి కృషి చేస్తోందని, ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలను వేగవంతం చేసి రైతుల అవసరాలు తీర్చాలని సూచించారు. అధికా రులు నీటి వినియోగాన్ని సమర్థవంతంగా ప్లాన్ చేయాలని, వారబంధి ద్వారా జొన్ 1, జోన్ 2 లకు ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం నీటిని విడుదల చేయాలన్నారు.

కొన్ని చోట్ల మోటార్లు పెట్టడం, ఇతరత్రా కారణాల వల్ల అందాల్సినంత నీరు అంద డం లేదని, వారబంధీ రోజులను కూడా పెంచాలని  సూచించారు. కలెక్టర్ సత్యప్ర సాద్ మాట్లాడుతూ రైతులు ఎవ్వరూ అందో ళన పడాల్సిన అవసరం లేదని, ఏ ఒక్క రైతుకు కూడా నష్టం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామన్నారు.

జిల్లాలో చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందిం చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవా లని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, డీఈ లు  ఇంజనీరింగ్ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.