calender_icon.png 19 March, 2025 | 5:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చివరి ఆయకట్టుకు సాగు నీరందేలా చర్యలు

19-03-2025 02:16:17 AM

జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్

జగిత్యాల, మార్చి 18 (విజయక్రాంతి): చివరి ఆయకట్టు వరకు సాగు నీరందించి రైతులు వేసిన పంటలను కాపాడేందుకు అన్ని రకాల కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జగిత్యాల కలెక్టర్ బి.సత్యప్రసాద్ అధికారులకు సూచించారు. జిల్లాలోని గొల్లపల్లి మండల లోత్తునూరు గ్రామం, వెల్గటూర్ మండలం కుమ్మరపల్లి గ్రామంలోని డి - 64, డి - 53, డిస్ట్రిబ్యూటరీ టైలింగ్ కెనాల్లను కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి మంగళవారం  పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రబీ సీజన్ పంటలను కాపాడే బాధ్యత రైతులతో పాటు ప్రభుత్వ యంత్రాంగంపై కూడా ఉందన్నారు. సాగు నీరు వృధా కాకుండా, దుర్వినియోగం కాకుండా ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు.

కెనాల్ ఆవరణలోని పిచ్చి మొక్కలను పూర్తి స్థాయిలో తొలగించి, నీరు సరిగా ప్రవహించే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దానికై కావాల్సిన మరమ్మతుల కోసం ప్రతిపాదనలు పంపాలని, ఎన్‌ఆర్‌ఈజీఎస్ నుంచి కావలసిన నిధులు మంజూరు చేస్తామని కలెక్టర్ బి.సత్యప్రసాద్ ఆదేశించారు.  జగిత్యాల ఆర్డీవో మధుసూధన్, ఇరిగేషన్ ఈఈ ఖాన్, సంబంధిత శాఖల అధికారులున్నారు.