calender_icon.png 26 December, 2024 | 1:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యాసంగి పంటకు సాగు నీరు

26-12-2024 01:49:46 AM

పలు ప్రాజక్టుల నుంచి విడుదల చేసిన ఎమ్మెల్యేలు

నల్లగొండ/నిజామాబాద్/నిర్మల్, డిసెంబర్ 25 (విజయక్రాంతి): యాసంగి పంట సాగు కోసం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ప్రాజెక్టుల నుంచి బుధవారం ఎమ్మెల్యేలు నీటిని విడుదల చేశారు. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం పుల్యాతండా వరద కాల్వపై డీ 9 ఎత్తిపోతల పథకం నుంచి కాల్వకు నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌రెడ్డి నీటిని విడుదల చేసి మాట్లాడారు. తన తండ్రి జానారెడ్డి ప్రారంభించిన ఈ ఎత్తిపోతల పథకాన్ని తాను ఎమ్మెల్యేగా పూర్తి చేసి ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.

ఈ ఎత్తిపోతల ద్వారా పెద్దవూర, తిరుమలగిరి సాగర్ మండలాల్లో 7,163 ఎకరాలకు సాగునీరందుతుందని తెలిపారు. నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని గాంధీనగర్ వద్ద శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి సరస్వతి కెనాల్‌కు నీటిని నిర్మల్ ఎమెల్యే మహేశ్వర్‌రెడ్డి విడుదల చేశారు.ఎస్సారెస్పీ నుంచి కాకతీయ కాల్వ కాలువ ద్వారా నీటిని ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి విడుదల చేశారు. లక్ష్మీ కాల్వకు 150 క్యూసెక్కుల నీటిని తెలంగాణసీడ్ డెవలఫ్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్‌రెడ్డి విడుదల చేశారు.