06-03-2025 12:00:00 AM
చేర్యాల, మార్చి 5 : రంగనాయక సాగర్ ద్వారా మద్దూరు దుల్మీట మండలాలకు రైతులకు సాగునీరు అందివ్వడానికి కృషి చేస్తానని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. మద్దూరు మండలంలోని కమలాయి పళ్లి గ్రామంలోని రంగనాయక సాగర్ ఉండి తవ్విన ఎల్ 10, తపస్పెల్లి రిజర్వాయర్ నుండి తవ్విన డి 3 కాల్వను ఆయన బుధవారం పరిశీలించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ రెండు కాలువలు పక్క పక్కనే ఉన్న ఒక కాలువ నుండి నీరు వచ్చి ఇంకో కాలువ నుండి నీరు రాకపోవడంతో రైతులకు ఇబ్బందిగా మారింది. రంగనాయక సాగర్ నుంచి వచ్చే కాల్వను తపస్ పల్లి కాల్వకు అనుసంధానం చేస్తే రైతులందరికీ నీరు వచ్చే అవకాశముందని ఇక్కడి నాయకులు ఫోన్ ద్వారా తెలిపినప్పటికీ తనకు అర్థం కాలేదని ఆయన తెలిపారు.
ఈ సమస్య పరిష్కారానికి తానే క్షేత్రస్థాయిలో పరిశీలించాడానికి వచ్చాను అన్నారు. క్షేత్ర స్థాయిలో పరిశీలించిన తర్వాత సమస్య అర్థమైందని అన్నారు. ఈ రెండు కాలువలను అనుసంధానం చేసి వీటి మధ్య ఒక తూమ్ నిర్మిస్తే, ఐదు గ్రామాల రైతులకు తాగునీరు అందుతుందన్నారు.
సుమారు 8 నుంచి 10 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ఈ సమస్య పరిష్కారానికి సంబంధిత మంత్రితో, ఎన్సీలతో మాట్లాడాలని తెలిపారు. త్వరలో సమస్య పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన తపస్ పల్లి రిజర్వాయర్ ను పరిశీలించారు.
వారం రోజుల్లోగా రైతులకు సాగునీరు అందే విధంగా కృషి చేస్తానన్నారు. సమస్య పరిష్కారం అయ్యేవరకు ఇక్కడనే ఉంటానని తెలిపారు. కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి గిరి కొండల్ రెడ్డి, నాయకులు నాగపురి కిరణ్ కుమార్, కొమ్ము నర్సింగరావు, ఆది శ్రీనివాస్, బండి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.