calender_icon.png 12 March, 2025 | 12:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంట చేతికొచ్చే వరకు సాగునీరు

12-03-2025 01:13:35 AM

నిర్మల్ మార్చి 11 (విజయక్రాంతి) ః జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల కింద పంటలు వేసుకున్న రైతులకు పంట చేతికచేవరకు నీటి సరఫరా ఉంటుందని రైతులు ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు.

మంగళవారం కడెం మండలంలోని కడెం ప్రాజెక్టు కింద సాగు అయిన పంట పొలాలను పరిశీలించి రైతులతో కలిసి సమస్యను అడిగి తెలుసుకున్నారు. కడెం ప్రాజెక్టులో ఉన్న నీటి నిల్వలు రైతుల పంటలకు సరిపోతాయని రైతులు పొదుపుగా నీటిని వినియోగించుకోవాలని సూచించారు.  కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంజి ప్రసాద్ నీటిపారుదల శాఖ అధికారి విట్టల్ మండల అధికారులు రైతులు పాల్గొన్నారు.