14-02-2025 02:01:47 AM
ఎక్సుజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
వనపర్తి, ఫిబ్రవరి 13 ( విజయక్రాంతి ) : యాసంగి లో డి8 కాలువ ద్వారా పంట పొలాలకు అందించే సాగునీటిని సమృద్ధిగా అందించే చర్యలు చేపట్టాలని రాష్ర్ట ఎక్సుజ్ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నీటిపారుదల శాఖ అధికారులను సూచించారు.
గురువారం వనపర్తి జిల్లా,పానగల్ మండలంలోని కదిరేపాడు, శాఖపూర్, మాధవరావుపల్లి గ్రామాల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించారు.ముందుగా ఆయా గ్రామాలలో సీసీ రోడ్ల నిర్మాణం పనులకు కు మంత్రి శంకుస్థాపన చేసారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాలలోని సమస్యలను ప్రజా ప్రభుత్వంలో పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. మంత్రి వెంట మండల, గ్రామ నాయకులు తదితరులు ఉన్నారు.