గజ్వేల్: మర్కుక్ మండల కేంద్రంలోని కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ ను ఇరిగేషన్ ఎస్ఈ వేణు సోమవారం పరిశీలించారు. గత నాలుగు రోజులుగా మల్లన్నసాగర్ నుండి కొండపోచమ్మ సాగర్ లోకి నీటిని పంపింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కొండ పోచమ్మ సాగర్ లో 5.04 టీఎంసీలకు నీటి మట్టం చేరుకుంది. కొండపోచమ్మ సాగర్ లోకి కొనసాగుతున్న నీటి పంపింగ్ ను సోమవారం ఇరిగేషన్ ఎస్ఈ వేణు పరిశీలించారు. పంపింగ్ విధానం, నీటిమట్టం తదితర అంశాల గురించి స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఈలు సాయి, శ్రీకాంత్ పాల్గొన్నారు.