27-03-2025 02:24:43 PM
బెల్లంపల్లి, (విజయక్రాంతి): బెల్లంపల్లి మండలంలో చాకిపల్లి గ్రామంలో గల గున్నికుంట చెరువు ను కొంతమంది స్థానికులు కబ్జా చేసిన వ్యవహారంపై ఇరిగేషన్ అధికారులు(Irrigation officials ) స్పందించారు. గురువారం గ్రామానికి చేరుకొని చెరువు వద్ద సర్వే చేశారు. కబ్జా అయిన చెరువులు పరిశీలించి తమకు న్యాయం చేయాలని గ్రామానికి చెందిన ముదిరాజ్ కులస్తులు, స్థానిక మాజీ ఎంపీటీసీ ముడిమడుగుల మహేందర్ ఇరిగేషన్ అధికారులను కోరడంతో గురువారం చెరువు ఎఫ్ టి ఎల్ వరకు సర్వే జరిపి హద్దులు నిర్ణయించారు. బెల్లంపల్లి ఇరిగేషన్ ఏఈ లు ప్రణీత్, సునీత, వర్క్ ఇన్స్పెక్టర్ శంకర్ లు సర్వేలో పాల్గొన్నారు. కబ్జాకు గురైన చెరువు శిఖం భూమిని కాపాడుతామని వారు ముదిరాజ్ కులస్తులకు హామీ ఇచ్చారు.