calender_icon.png 6 January, 2025 | 3:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హుస్సేన్ మియా పరివాహక ప్రాంత రైతులకు సాగునీరు

04-01-2025 01:48:50 PM

పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు

పెద్దపల్లి, (విజయక్రాంతి): కాకతీయ కాలువ నుండి పెద్దాపూర్ చెరువును నింపడం ద్వారా హుస్సేన్ మియా వాగు పరివాహక ప్రాంత పంట పొలాలకు సాగు నీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు తెలిపారు. శనివారం జూలపల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలోని చెరువును ఆయన పరిశీలించారు. కాకతీయ కాలువ రేవెల్లె క్రాస్ రెగ్యులేటరీ (సిఆర్) నుండి డి, 83 కెనాల్ ద్వారా పెద్దాపూర్ చెరువును నింపి, చెరువు మత్తడి ద్వారా నీటిని హుసేనిమియా వాగులోకి పంపిణీ చేయడం జరుగుతుందని, తద్వారా హుసేనిమియా వాగు పరివాహక ప్రాంతంలోని రైతులకు మేలు జరుగుతుందని ఆయన అన్నారు.  ఇరిగేషన్ శాఖ ఎస్ ఈ, ఈఈ తదితర అధికారులను వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఫోన్ ద్వారా ఆదేశించారు.  ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పుల్లూరి వేణుగోపాల్ రావు, గండు సంజీవ్, తదితరులు పాల్గొన్నారు.