03-03-2025 01:56:44 AM
వనపర్తి, మార్చి 2 (విజయక్రాంతి): పాలమూర్ జిల్లా బిడ్డ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు కృష్ణానది జలాలను ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో ప్రతి సెంటు భూమికి సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నామని పర్యాటక, అబ్కారి శాఖ మంత్రి జూప ల్లి కృష్ణా రావు అన్నారు. రాష్ర్ట ప్రభుత్వం ఏర్పడ్డాక ఇచ్చిన ప్రతి గ్యారెంటీని నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామన్నారు
ఉమ్మడి పాల మూరులో ఇప్పుడు ఉన్న ప్రతి ప్రాజెక్టు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మొదలుపెట్టినవని, ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న ప్రాజెక్టులకు కాంగ్రెస్ ప్రభుత్వం హ యాంలో ఎన్ని వేల 8173 కోట్ల నిధులు ఖ ర్చు చేయగా గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో ఖర్చు చేసింది కేవలం 6137 కోట్లు మాత్రమేనన్నారు పాలమూరు ప్రాజెక్టులు గత పది సంవత్సరాలలో నిర్లక్ష్యం కారణంగా రైతులు సాగునీరుకు ఇబ్బందులు పట్టారన్నారు.
ఎస్ ఎల్ బి సి కెనాల్ లో 44 కిలోమీటర్లు సొరంగ మార్గం చేపట్టాల్సి ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం హ్యంలోనే 25 కిలోమీటర్లు పూర్తి చేయడం జరిగిందని మిగిలిన మిగిలిన భాగం పూర్తి చేయకుండా గత ప్రభుత్వం పెండింగ్ ఉంచేసి నేడు ఎనిమిది మంది కార్మికుల చావులకు కారణమైం దన్నారు. బీసీల కులగలను చేసి బి.సి లకు 42% రిజర్వేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలియజేశారు.
ఆడబిడ్డల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచాలన్నదే సీఎం లక్ష్యం: మంత్రి అనసూయ ( సీతక్క )
ఆడబిడ్డల ఆర్థిక స్థితిగతులను ఏ విధంగా మెరుగుపరచాలి అని రాష్ర్ట ముఖ్యమంత్రి నిరంతరం మహిళల సాధికారిక పట్ల ఆలోచిస్తున్నారని రాష్ర్ట గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి అనసూయ ( సీతక్క ) అన్నారు. మహిళల స్వయం ఉపాధికి 21 వేల కోట్ల రూపాయలను బ్యాంక్ లింకేజ్ రుణాలుగా మేళా సంఘాలకు ఇవ్వడం జరిగింది అన్నారు. మహిళలు పెట్రోల్ పంపు లు నడుపుకునేందుకు క్యాంటీన్లు నడుపుకునేందుకు సోలార్ విద్యుత్తు ప్లాంట్లు ఏర్పా టు చేసేందుకు ప్రభుత్వము సహకారం చేస్తుందని తెలియజేశారు.
ఆర్టీసీలో 1000 బస్సులు మహిళా సంఘాల ద్వారా కొనుగోలు చేసి నడిపించడం జరుగుతుందని తెలియజేశారు. మహిళా సంఘాల్లో ఉన్న మహిళలు ఎవరైనా చనిపోతే 10 లక్షల రూపాయలు బీమా ఇచ్చేందుకు ప్రభుత్వము భీమా ప్రవేశపెట్టిందన్నారు. దీనితో పాటు మహిళా సంఘాల ద్వారా చనిపోయిన మహిళ తీసుకున్న రుణాన్ని మాఫీ చేసే విధంగా రాష్ర్ట ప్రభుత్వము ప్రణాళికలు చేసిందన్నారు. మార్చి 8న హైదరాబాద్ లో మహిళా సంఘాలతో మరియు సభ ఏర్పాటు చేయ డం జరుగుతుందని తెలియజేశారు.
పాఠశాలల్లో విద్యార్థులకు ఏకరూ ప దుస్తులు కుట్టించేందుకు గత ప్రభుత్వం కంపెనీలకు ఆర్డర్ ఇస్తే ప్రస్తుత ప్రభుత్వము మహిళా సాధికారతకై వారి ఉపాధి కొరకు మహిళల చేతనే పిల్లల ఏక రూప దుస్తులు కుట్టించడం జరిగింది. ఆదర్శ పాఠశాలలో మహిళల ద్వారానే పాఠశాలల మరమ్మతులు, ఇతర సదుపాయాల పనులు చేయిం చి వారికి ఉపాధి కల్పించడం జరిగింది. మహిళలకు ప్రభుత్వము కల్పిస్తున్న సహకారాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.
సామాజికంగా వెనుకబడిన కులాలను గుర్తించేందుకు కులగనణ సర్వే: నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి
సామాజికంగా వెనుకబడిన కులాలను గుర్తించేందుకు రాష్ర్ట ప్రభుత్వం పకడ్బందీగా కులగలను చేపట్టి 50 రోజుల్లో పూర్తి చేసిందని నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి అన్నారు. ఈ కులాలలో ఎంతమందికి ఉపాధి ఉంది వారి ఆర్థిక స్థోమత ఏంటిది అనేది సర్వే ద్వారా తెలుసుకోవడం జరిగింది. దేశంలో ఎక్కడా లేని విధంగా 56 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒక్కో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు 200 కోట్లు ఖర్చు చేయడం జరుగుతుంది.
ఇందులో అన్ని కులాల మతాల విద్యార్థులు చదువుకుంటారు. దేశంలోనే ఇదొక విప్లవాత్మకమైన మార్పుగా అభివర్ణించారు. వనపర్తి జిల్లా వాసి శ్రీనివాస్ శెట్టి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్ ఉండటంతో ఆయన 6 కొత్త బ్రాంచ్లను నేడు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అచ్చంపేటలో గిరిజనులను అడాప్ట్ చేసుకొని వారి అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలియజేశారు. తన కృషి వల్ల యూనియన్ బ్యాంక్ ద్వారా జిల్లాలో ఐదు కొత్త బ్రాంచ్లను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటుంది అన్నారు.
గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమం కల్పించేందుకు యూనియన్ బ్యాంకు ముందుకు వచ్చిందన్నారు. డిజిటల్ లైబ్రరీ, ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ముందుకు వచ్చింది అన్నారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం లో వివిధ బ్యాంకుల ద్వారా రుణ మేళా ఏర్పాటు చేసి 1017 కోట్ల రూపాయల రుణాలను మంజూరు చేయ డం జరిగింది. అదే విధంగా జాబ్ మేళా నిర్వహించి 295 మందికి ఆయా సం స్థల్లో ఉద్యోగాలు కల్పించడం జరిగిందని వా రికి నేడు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ని యామక పత్రాలు ఇవ్వడం జరిగిందన్నారు.
వెయ్యి కోట్ల అభివృద్ధి పనులకు సి ఎం చేతుల మీదుగా శంకుస్థాపనలు: వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి
ప్రభుత్వం ఏర్పడ్డాక వనపర్తి జిల్లాలో ఇప్పటివరకు 375 కోట్ల అభివృద్ధి పనులు చేసుకోవడం జరిగిందని ఈరోజు మరో వె య్యి కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు రాష్ర్ట ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపనలు చేసుకోవడం జరిగిందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి అన్నారు. 500 పడకల ప్రభుత్వ ఆసుపత్రి, పెబ్బేర్ లో 30 పడకల ప్రభుత్వాసుపత్రికి శంకుస్థాపనలు చేసుకోవడం జరిగింది. 100 గ్రామాలకు గ్రామీణ రోడ్లను మంజూ రు చేసిన సీతక్కకు ధన్యవాదాలు తెలిపారు.
ఈరోజు శంకుస్థాపన చేసిన ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ కు మాజీ ఎమ్మెల్యే జయరాములు యాదవ్, 500 పడకల ఆసుపత్రి కి మాజీ ఎమ్మెల్యే డా. బాలకిష్టయ్య పేరు పెట్టాలని ముఖ్యమంత్రిని ఎమ్మెల్యే కోరా రు. స్పందించిన సి ఎం ఎమ్మెల్యే కోరిన విధంగా పేర్లు పెట్టాలా చేయాలనీ సి ఎస్ శాంతి కుమారిని ఆదేశించారు. జిల్లాలో సంక్షేమ హాస్టల్ ప్రైవేట్ భవనాలు ఉన్నాయని వాటికి పక్క భవనాలు నిర్మించేందు కు, పాలిటెక్నికళాశాలకు రేన్యువేశన్ చేసేందుకు నిధులు మంజూరు చేసి కళాశాలకు పూర్వ వైభవం తీసుకురావాలని, జేఎన్టీ యూ కళాశాల భవన నిర్మా ణానికి నిధులు మంజూరు చేయాలనీ ము ఖ్యమంత్రి ని ఎమ్మెల్యే కోరారు.
జిల్లాలోని 133 గ్రామపంచాయతీలు రెండు మున్సిపాలిటీలకు ఎస్. డి.ఎఫ్. కింద నిధులు మంజూ రు చేయాలని ముఖ్యమంత్రి కోరారు. జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకునేందుకు రాష్ర్ట ఉప ముఖ్యమంత్రి ముఖ్య మంత్రి గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి నిధులు మంజూరు చేయాలని కోరారు.