calender_icon.png 21 November, 2024 | 7:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీబీకి చిక్కిన ఇరిగేషన్ ఈఈ

28-09-2024 01:15:51 AM

  1. ఎన్‌వోసీ కోసం రూ.14 వేలు డిమాండ్
  2. ఈఈతో పాటు టెక్నికల్ అసిస్టెంట్ అరెస్ట్

జనగామ, సెప్టెంబర్ 27(విజయక్రాంతి): లంచం తీసుకుంటూ ఇరిగేషన్ ఈఈతో పా టు టెక్నికల్ అసిస్టెంట్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. హిందూస్థాన్ పెట్రోల్ బంక్ వారు గత సంవత్సరం జూన్‌లో లింగాలఘణపురం మండలంలో కొత్త పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చారు.

దీని కోసం లింగాలఘణపు రం నివాసి, ఎక్స్ సర్వీస్‌మన్ సత్యపాల్‌రెడ్డి తన భార్య పేరు మీద దరఖాస్తు చేయగా డ్రా పద్ధతిలో వారి కే పెట్రోల్ బంక్ అలాట్ అయింది. ఇందుకోసం ఎన్‌వోసీ కావాల్సి ఉండగా ఆర్‌అండ్ బీ ఈఈ చిలుకపాటి హుస్సేన్ రూ.14 వేల లంచం డిమాండ్ చేశాడు.

దీంతో సత్యపాల్‌రెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. శు క్రవారం సత్యపాల్‌రెడ్డి కలెక్టరేట్‌లోని ఆర్‌అ ండ్‌బీ ఈఈ కార్యాలయంలో ఈఈ చిలుకపాటి హుస్సేన్‌కు రూ.12 వేలు, టెక్నికల్ అసి స్టెంట్‌కు రూ.2 వేలు లంచం ఇవ్వగా.. అక్కడే కాపు కాసి ఉన్న వరంగల్ ఏసీబీ డీఎస్పీ సా ంబయ్య బృందం పట్టుకున్నారు.