calender_icon.png 5 May, 2025 | 2:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతన్నకు సాగునీటి కష్టాలు

25-04-2025 12:00:00 AM

తలాపునే గోదావరి ఉన్నా.. సాగుకు తప్పని తిప్పలు

కాల్వల ద్వారా పంటలకు సాగు నీరు

మంచిర్యాల, ఏప్రిల్ 2౪ (విజయక్రాం తి): మంచిర్యాల జిల్లా నస్పూర్ మండల రైతుల తలాపున గోదావరి నది ఉన్నా.. పం టలు సాగు చేసుకునేందుకు నీరు లేక రైతులకు కష్టాలు తప్పడం లేదు. గోదావరి తీర ప్రాంత రైతులు సాగు నీటి కోసం గోదావరిలో రెండున్నర కిలో మీటర్లు కాలువ తీసి పంటలను కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నమే చేశారు. చివరి దశలో ఉన్న వరి పంటను కాపాడుకునేందుకు రైతులు గోదావరి పారకానికి అడ్డుపడి మరీ నీటిని నస్పూ ర్ మండలం సీతారాంపల్లి (ప్రస్తుత మంచిర్యాల కార్పొరేషన్) గ్రామ రేవు(గోదావరి ఒడ్డు)కి మల్లించారు.

సాగుకు గోదావరి నీరే ఆధారం..

సీతారాంపల్లి గ్రామ రైతులు తీరంలో ఉన్న పొలాల సాగుకు గోదావరి నీటినే ఉపయోగిస్తుంటారు. గోదావరి నదికి బోరుమో టర్లు, పైపులు అమర్చి వరి పంటకు నీటి తడులు అందిస్తుంటారు. గత పదేండ్లలో కాలేశ్వరం ప్రాజెక్టు, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నీటి నిల్వతో గోదావరిలో బ్యాక్ వాటర్ తో  పుష్కలంగా ఉండేది. కాలేశ్వరం ప్రాజెక్టు, బ్యారేజ్ ఫిల్లర్లు పగుళ్లు తేలి ప్రమాదకరంగా ఉందని, మరోవైపు వర్షం ముంపు కారణంగా నీటిని నిలువ చేయకుండా కిందికి వదిలేస్తుండటంతో రైతులకు తిప్పలు తప్పడం లేదు. 

తలాపునే గోదావరి ఉన్నా.. 

సీతారాంపల్లి గ్రామ తలాపునే గోదావరి నది ఉన్నా సాగు నీటికి రైతులకు కష్టాలు తప్పడం లేదు. ఎగువ ఉన్న ఎల్లంపల్లి ప్రాజె క్టు నుంచి దిగువ గోదావరిలోకి ఆశించిన నీరు వదలక పోవడం ఒక వైపు, కింద ఉన్న సుందిళ్ల బ్యారేజ్ గేట్లు తెరిచి ఉంచడంతో చుక్క నీరు ఆగకపోవడంతో గోదావరిలో నీటి పారకం తగ్గింది. దీనికితోడు వేసవి ఉష్ణోగ్రతలతో గోదావరిలో నీటి నిల్వ లేకుం డా పోయింది. గోదావరి మధ్యలో కొంత మేర నీరు పారుతున్నా.. ఆ నీరు మంచిర్యా ల జిల్లా సరిహద్దు వైపు కాకుండా పెద్దపల్లి జిల్లా సరిహద్దు వైపు పారకం ఉండటంతో రైతులకు సాగునీటికి ఇబ్బందికరంగా మారింది. 

నీటిని మళ్లించే ప్రయత్నం.. 

పంటలను కాపాడుకునేందుకు సీతరాంపల్లి రైతులంత కలిసి రెండు నెలల కిందట నీటిని మళ్లీంచే ప్రయత్నం చేసి సఫలికృతులయ్యారు. ఖరీఫ్ సీజన్‌లో జూలై నుంచి అక్టోబర్ వరకు వర్షాలతో ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద నీరుతో గోదావరి నిండుగా ప్రవహించడంతో పంటల సాగుకు ఇబ్బంది లేకుండా ఉండేంది. రబీ సీజన్‌లో జనవరి నుంచి గోదావరి నీటి ప్రవాహం తగ్గిపోవడం, మరో వైపు పంట ఎదిగే సమయంలో నీరందక రైతులు ఇబ్బంది పడాల్సి వస్తుంటుంది.

దీనితో సీతారాంపల్లి గోదావరి తీరాన సాగు చేసే రైతులు మంచిర్యాల పట్టణ సమీప గోదావరి రైల్వేట్రాక్ బ్రిడ్జి సమీపం (పెద్దపల్లి జిల్లా వైపు) నుంచి వెలుతున్న నీటిని సీతారాంపల్లి (మంచిర్యాల జిల్లా సరిహద్దు) వరకు 12 ఫీట్ల వెడల్పుతో, ఆరు ఫీట్ల లోతుతో దాదాపుగా రెండున్నర కిలోమీటర్ల మేర జేసీబీతో తవ్వి కాల్వ తీయించి పంటలను కాపాడుకునేందుకు గోదావరి సాధారణ పారకాన్నే మార్చారు. గోదావరి సరిహద్దు నుంచి రైతు పోలం దూరాన్ని బట్టి ఒక్కో రైతు ఎకరానికి రూ. 600 నుంచి రూ.1500 వరకు జమ చేసి సుమారు 200 ఎకరాల రైతులు రూ.2 లక్షల వరకు జమ చేసి ౩ రోజులపాటు కాల్వ తీయించారు. ఈ క్రమంలో మధ్య మధ్యలో రెండు సార్లు కాల్వ తెగిపోతే మరో రూ. 20 వేలు జమ చేసి కాల్వను పునరుద్దరించుకొని పంటలను కాపాడుకున్నారు.

రెండు కిలో మీటర్లకుపైగా కాల్వ తీసినం.. - 

గోదావరి నదిలో పుష్కలంగా నీరుంటుందని ఐదేండ్ల పొడవునా భూములను కౌవులుకు తీసుకొని పంటలు సాగు చేస్తున్న. ఈ ఏడా ది సైతం రెండు ఎకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేస్తున్నా.. వానాకాలంలో పుష్కలంగా గోదావరిలో నీరు ఉండేది సాగుకు ఇబ్బంది ఉండేది కాదు. ఎండా కాలం పంటకు నాట్లు వేసుకున్న సమయం నుంచి నీరు తగ్గుతూ వచ్చింది. రెండు నెలల నుంచి గోదావరి నీరు లేదు. కొద్ది పాటిగా పారుతున్న నీరు అవతలి వైపు నుంచి పోతుంది. మంచిర్యాల రైల్వే బ్రిడ్జి దగ్గర నుంచి రెండు కిలోమీటర్ల వరకు కాలువ తీయించినం. నేను సాగు చేస్తున్న పొలం దూరం ఉంది. ఎకరానికి రూ.1500 చొప్పున చెల్లించి పంటను కాపాడుకుంటున్న.

-గొర్లపల్లి ప్రభాకర్, రైతు, సీతారాంపల్లి

నీరు నిలువ ఉంచుత లేరు

గతంలో రెండు పంటలకు సాగు నీటికి డోకా లేకుం డే. గోదావరి నుం చి బోరుమోటర్ ద్వారా సాగు నిందించిన... రెండేండ్ల నుం చి గోదావరిలో నీరు నిలువ ఉంచుత లేరు. రైతులమంతా కలిసి అటు (పెద్దపల్లి జిల్లా వైపు) నుంచి పారుతున్న పారకాన్ని పొలం దూరం బట్టి ఎకరానికి ఇంత అని జమ చేసుకున్నాం. రెండు లక్షలకు పైగా ఖర్చు చేసి కాల్వ తీపించినాం. రెండుసా ర్లు కాల్వ కూలిపోతే మరో రూ.20వేలు జమ చేసినాం. నాకు ఎకరానికి రూ.700 చొప్పున మొత్తం రూ.3500 ఇచ్చినా. ఇంకో తడి అందుతే పదిహేను రోజుల్లో పంట కోతకు వస్తుంది. బోర్లు వేయిద్దామంటే ఈ ప్రాంతంలో బండలు ఉండ డం వల్ల బోర్లు పడడం లేదు.

- పోగాల శ్రీనివాస్, రైతు, సీతారాంపల్లి