బెల్లంపల్లి (విజయక్రాంతి): తన కుటుంబాన్ని ఇరిగేషన్ అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని తాండూర్ మండలం కు చెందిన రైతు పి.సత్తయ్య ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం తన కుటుంబ సభ్యులతో బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ లో ఇరిగేషన్ అధికారులు తీరిపై తన గోడు వెల్లబోసుకున్నారు. తనకు సర్వే నంబర్ 67 లోని రాంపూర్ శివారులో ప్రైవేటు కుంటలో భూమి ఉందని 32 ,32/1 సర్వే నెంబర్లు 10 ఎకరాల 36 గుంటల భూమి ఉందని ఆయన తెలిపారు. పక్కనే 68 సర్వే నంబర్ లో గల చెరువుకు మరమ్మతులు చేపట్టడంతో తన పొలంలోకి నీళ్లు చేరాయని ఆవేదన వ్యక్తం చేశాడు. కొద్దిపాటి మట్టిని తన పొలంలో వేసుకున్నందుకు ఇరిగేషన్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. తన పట్టా భూమి చెరువు కిందికి వస్తుందని చెబుతూ ఇబ్బందులకు పాలు చేస్తున్నారని ఆవేదన చెందాడు. సంబంధిత అధికారులు తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు.