05-04-2025 12:57:49 AM
రూ.లక్ష తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు
పటాన్‌చెరు, ఏప్రిల్ 4: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ఇరిగేషన్ శాఖ సబ్ డివిజన్ పరిధిలో గుమ్మడిదల ఇరిగేషన్ ఏఈగా పనిచే స్తున్న రవికిశోర్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలో సంతోశ్ అనే వ్యక్తి 4,400 గజాలలో ప్రహరీ నిర్మించాడు. ఎ న్వోసీ(నిరభ్యంతర పత్రం) కోసం ఏఈ రవికిశోర్‌ను సంప్రదించగా.. ప్రహరీ నాలాపై నిర్మించావని, హైడ్రాకు ఫిర్యాదు చేశామని అధికారులు వచ్చి ప్రహరీని కూల్చేస్తారని ఏ ఈ భయపెట్టాడు.
ప్రహరీ కూల్చకుండా ఉం డాలంటే రూ.10 లక్షలు ఇవ్వాలని సంతోష్ ను డిమాండ్ చేశాడు. రూ.7 లక్షలు ఇచ్చేందుకు ఒప్పుకున్న సంతోష్.. ఏసీబీ అధికారు లకు ఫిర్యాదు చేశాడు. ఏసీబీ హైదరాబాద్ రేంజ్ డీఎస్పీ శ్రీధర్ సూచన ప్రకారం శుక్రవారం ఉదయం పటాన్‌చెరులోని నీటి పా రుదలశాఖ సబ్ డివిజన్ కార్యాలయంలో ఏ ఈ రవికిశోర్‌ను సంతోష్ కలిశాడు. రవికిషోర్‌కు ఇచ్చేందుకు రూ.లక్ష సంతోష్ తన కారు లో పెట్టాడు. కారులో ఉన్న రూ.లక్షను తీసుకునేందుకు ఏఈ రాగా ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ అధికారులతో కలిసి పట్టుకున్నారు.