రోడ్డుపైనే లంచం తీసుకుంటుండగా పట్టివేత
పెద్దపల్లి, నవంబర్ 25 (విజయక్రాంతి): పెద్దపల్లి పట్టణంలో (ఎస్ఆర్ఎస్పీ) నీటి పారుదల శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ నర్సింగరావు సోమవారం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఓ కాంట్రాక్టరుకు సంబంధించిన బిల్లు విషయంలో ఏఈ నర్సింగరావు లంచం డిమాండ్ చేశా డు.
దీంతో ఆ కాంట్రాక్టర్ ఏసీ బీ అధికారులను ఆశ్రయిం చాడు. ఒప్పంద ప్రకారం సదరు కాంట్రాక్టర్ సోమవారం ఏఈ నర్సింగరావుకు రోడ్డుపైనే రూ.20 వేలు ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో సిబ్బంది పట్టుకున్నారు.