27-03-2025 12:00:00 AM
బూర్గంపాడు,మార్చి 26(విజయక్రాంతి): కాంట్రాక్ట్ కార్మికుల స్కిల్‌మాట్రిక్స్ లో జరిగిన అవకతవకలను సరిచేయాలని కోరుతూ మిత్రపక్షాల ఆధ్వర్యంలో ఐ టి సి యాజమాన్యానికి బుధవారం వినతిపత్రం సమర్పించారు.13వ వేతన ఒప్పందంలో భాగంగా కాంట్రాక్టు కార్మికుల మినిట్స్ ఆఫ్ ది కన్సాలిడేషన్ ప్రొసీడింగ్స్ క్లాజు నెం.4 స్కిల్ అప్ గ్రేడేషన్ ప్రకారం ఐటీసీ మిల్లులో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు స్కిల్ మ్యాట్రిక్స్ అమలు చేయాలని ఐఎన్టియుసి మిత్ర పక్షాల నాయకులు ఐటీసీ హెచ్‌ఆర్ మేనేజర్ శ్యామ్ కిరణ్ కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా పలు అంశాలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు.సకాలంలో ఎల్ టి ఏ పూర్తి అయినప్పటికి థర్డ్ పార్టీ సర్వే పేరుతో 2 1/2 సం.లు కాలయాపన చేసి దీనిని అక్టోబర్ 2024 నుండి అమలు చేస్తున్నాము అని కాంట్రాక్టు కార్మికులకు తెలియజేయడం జరిగిందని దీని వలన సుమారు 4 కోట్ల రూపాయలు కాంట్రాక్టు కార్మికులు నష్టపోయారని వివరించారు.
థర్డ్ పార్టీ సర్వే పేరుతో యాజమాన్యం ,గుర్తింపు సంఘం కుమ్మక్కై తీసుకున్న నిర్ణయం వల్ల కాంట్రాక్టు కార్మికులలో తీవ్రమైన వ్యతిరేకత నెలకొని ఉందని తెలియజేశారు. గతంలో వలే అంశాల ప్రకారం స్కిల్ మ్యాట్రిక్స్ ను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రస్తుతం అమలు చేసిన 16 సంవత్సరాల సర్వీసు కాకుండా గతంలో లాగే అన్-స్కిల్ నుండి సెమీస్కిల్కు 7 సం., సెమీ-స్కిల్ నుండి స్కిల్ కు 6 సం.లు సర్వీసును ప్రామాణికంగా తీసుకుని అర్హులైన వారందరికీ ఒకేసారి స్కిల్ మ్యాట్రిక్స్ ను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమం లో ఐఎన్టియుసి మిత్రపక్షాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గోనె రామారావు. యారం పిచ్చిరెడ్డి. ఐ ఎన్ టి యు సి మిత్రపక్షాల నాయకులు కార్యకర్తలు ,కాంట్రాక్టర్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.