calender_icon.png 25 November, 2024 | 8:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాలమూరు-రంగారెడ్డిలో అవకతవకలు

25-10-2024 12:37:02 AM

  1. మూడేళ్లలో పూర్తి కావాల్సినా.. 9 ఏండ్లుగా పెండింగ్
  2. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ తరఫున సీఎం రేవంత్‌కి పద్మనాభరెడ్డి లేఖ

హైదరాబాద్, అక్టోబర్ 24 (విజయక్రాం తి): పాలమూరు ప్రాజెక్ట్ నిర్మాణ ప్రక్రియలో అనేక అవకతవకలు జరిగాయని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు ఎం పద్మనాభరెడ్డి ఆరోపించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణంపై నిర్లక్ష్యం, వ్యయం వంటి అంశాలపై సీఎం రేవంత్‌రెడ్డికి గురువారం బహిరంగ లేఖ రాశారు.

2015లో మొదలైన ప్రాజెక్టు మూడేళ్లలో పూర్తికావాల్సి ఉండగా, తొమ్మిదేండ్లునా ఇం కా మధ్యలోనే ఆగిందని పేర్కొన్నారు. పూర్తయ్యేందుకు ఇంకా నాలుగైదేండ్లు పట్టొచ్చిన అంచనా వేశారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం, పనుల్లో ఆలస్యం, తరచూ మార్పులు, చేర్పులతో రూ. 32,200 కోట్లతో పూర్తి కావాల్సి న ప్రాజెక్టు నిర్మాణ వ్యయం భారీగా పెరిగి రూ.50 వేల కోట్లకు చేరిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎలాంటి సాంకేతిక విశ్లేషణ లేకుండా కేవలం సీఎం ఆదేశాలతో ప్రాజెక్టును జూరాల నుంచి శ్రీశైలానికి మార్చారని వెల్లడించారు. కేంద్రం నుంచి అనుమతులు లేకుండా ట్రిబ్యునల్ ఆదేశాలకు విరుద్ధంగా పని మొదలు పెట్టి ప్రభుత్వంపై రూ.920 కోట్ల జరిమానా విధించే స్థాయి దిగజారి పోయారని మండిపడ్డారు. సమగ్ర విచారణ జరిపి బాధ్యులను శిక్ష పడేలా చూడాలని లేఖ ద్వారా సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు.