calender_icon.png 30 October, 2024 | 12:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డబుల్ ఇళ్లలో అవకతవకలు

06-07-2024 01:55:20 AM

  • ఎన్నికల్లో లబ్ధిపొందేలా మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఎత్తుగడ 
  • బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి సంకినేని వరుణ్‌రావు విమర్శలు

సూర్యాపేట, జూలై 5: బీఆర్‌ఎస్ హయాంలో డబుల్‌బెడ్రూం ఇళ్ల కేటాయింపులో జరిగిన అవకతవకలు బయటపడ కుండా ఉండేందుకే మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి తన ఇంటిపై దాడికి పురిగొల్పారని బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి సంకినేని వరుణ్‌రావు ఆరోపించారు. డబుల్‌బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులు తన ఇంటి ముందు నిరసన వ్యక్తం చేసిన సందర్బంగా శుక్రవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. కేవలం ఎన్నికల్లో లబ్ది కోసమే నాటి మంత్రి జగదీష్‌రెడ్డి డబుల్‌బెడ్రూం ఇళ్ల పంపిణీ పేరిట కుట్రకు తెరలేపాడని విమర్శించారు.

385 ఇండ్లు పూర్తి అయితే 804 ఇండ్లకు డ్రా తీయించారన్నారు. ఇందుకు గాను కలెక్టర్ వెంకట్రావును ఓ పావుగా వాడుకున్నారన్నారు. బీఆర్‌ఎస్ నాయకులు చెప్పిన వారికే ఇండ్లు కేటాయించి, అనర్హులను ఎంపిక చేశారన్నారు. ఎనిమిది నెలలు గడిచినా లబ్ధిదారులకు ఇండ్లు కేటాయించకపోవడానికి కారణమేంటో చెప్పాలన్నారు. జగదీష్‌రెడ్డి అక్రమాలను ప్రశ్నించినందుకే 800 మందిని తన ఇంటిపైకి పంపారన్నారు.