calender_icon.png 13 January, 2025 | 6:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీలో అవకతవకలు

12-01-2025 10:39:05 PM

మందమర్రి (విజయక్రాంతి): పట్టణంలో ఇటీవల జరిగిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీలో కాంగ్రెస్ పార్టీ నాయకుల సహకారంతో ఆర్హుల జాబితాలో అవకతవకలు జరిగాయని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల అర్హుల జాబితాలో అనర్హులకు ఇల్లు కేటాయించారని, కాంగ్రెస్ పార్టీ నాయకుల హస్తంతోనే అవకతవకలు జరిగాయని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగినప్పటికీ స్థానిక ఎమ్మెల్యే స్పందించక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. డబుల్ బెడ్ రూమ్ అర్హుల జాబిత లిస్టును కాంగ్రెస్ నాయకులు విచారణ చేపట్టారని ప్రచారం జరిగినప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టక పోవడం సరైంది కాదన్నారు.

ఇప్పటికైనా ఎమ్మెల్యే స్పందించి అవకతవకలకు పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మందమర్రి పట్టణ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జే రవీందర్, మేడిపల్లి సంపత్, బండారు సూరిబాబు, ఓ రాజశేఖర్, కొంగల తిరుపతి రెడ్డి, ఎండీ అబ్బాస్, బర్ల సదానందం, దాసరి రాజనర్సు, మేడిపల్లి మల్లేష్, పల్లె నర్సింహులు, టిబిజికెఎస్ నాయకులు బడికెల సంపత్ కుమార్, యూత్, విద్యార్థి, సోషల్ మీడియా నాయకులు పాల్గొన్నారు.