calender_icon.png 20 April, 2025 | 9:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానేరు రివర్‌లో అక్రమాలు, అవకతవకలు

19-04-2025 01:57:06 AM

మాజీ మేయర్ వై సునీల్ రావు

కరీంనగర్, ఏప్రిల్ 18 (విజయ క్రాంతి): మానేరు రివర్ ప్లాంట్ అభివృద్ధి పనులు అక్రమాలు, అవతల జరిగితే రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తుందని కరీంనగర్ మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు మండి పడ్డారు. శుక్రవారం రోజు నూతనంగా నిర్మాణం చేస్తున్న మానేరు రివర్ ఫ్రంట్ తో పాటు తీగలవంతెనను బీజేపి పార్టీ శ్రేణులతో కలిసి  సందర్శించారు.

సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... గత ప్రభుత్వం  కరీంనగర్ నగరానికి పర్యటక శోభ తెవాలని ఆలోచన చేసి 196 కోట్లతో తీగలవంతెన నిర్మాణం చేసిందో అది ప్రస్తుతం చాలా అద్వానంగా మారిందని అన్నారు. రాత్రి సమయంలో కేబుల్ బ్రిడ్జ్ ప్రాంతంకు ఎవ్వరు వెల్లలేని పరిస్థితి అన్నారు. సరైన రోడ్డు లేక... లైటింగ్ వ్యవస్థ లేక కేబుల్ బ్రిడ్జ్ చీకట్లతో ప్రజలకు దర్శనమిస్తూ... అదోగతి పాలైందని అన్నారు.

మరో వైపు నగరంలో మానేరు రివర్ ఫ్రంట్ నిర్మాణం చేయాలని గత ప్రభుత్వం జివో నెంబర్ 215, 296 రెండు జీవోల ద్వారా 546 కోట్ల రూపాయల రెండు దఫాలుగా కేటాయించి నిర్మాణం పనులు ప్రారంభం చేయడం జరిగిందన్నారు.  మానేరు రివర్ ఫ్రంట్ అభివృద్ధి పనులు 100 కోట్లు టూరిజం శాఖకు, 446 కోట్లు ఇరిగేషన్ శాఖకు కేటాయించి... పనులు జరపించడం జరుగుతుందన్నారు.

ప్రస్తుతం మానేరు రివర్ ఫ్రంట్ అభివృద్ధి పనులు నాణ్యత లోపంతో నత్తనడకన సాగుతున్నాయని మండి పడ్డారు. ప్రస్తుతం చేసిన నిర్మాణం పనులకు 16 ధఫాలుగా 220 కోట్ల రూపాయలు ఏజెన్సీ కాంట్రాక్టర్ బిల్లులు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఇష్టా రాజ్యంగా అక్కమాలు, అవకతవకలకు అధికారులు, కాంట్రాక్టర్ కుమ్మక్కై బిల్లులు తీసుకోవడం దరిగిందని ఆరోపించారు.   

మానేరు రివర్ ఫ్రంట్ అభివృద్ధి పనుల్లో జరుగుతున్న అక్రమాలు, అవకతవకల పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తకుమార్ రెడ్డిలు చొరవ తీస్కోని పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యుల పై చర్యలు తీస్కోవాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ నగరం నుండి వచ్చే ప్రధాన డ్రైనేజీలు మానేరు రివర్ ఫ్రంట్ కట్టే ప్రదేశంలోనే కలుస్తాయని... ఇప్పటి వరకు రివర్ ఫ్రంట్ ప్రదేశంలో డ్రైనేజీ నిర్మాణమే చేయకపోవడం చాలా దారుణం అన్నారు.   

గతంలో దిగువ బాగానా చెక్ డ్యాం నిర్మాణం చేశారు.... లక్ష క్యూసెక్స్ నీరు డ్యాం నుండి విడుదల చేస్తే.... పూర్తిగా కొట్టుకు పోయిందని... ఇప్పటి వరకు సంబంధిత కాంట్రాక్టర్ పై ఎలాంటి చర్యలు లేవన్నారు. మల్లీ చెక్ డ్యాం వద్ద చెక్ డ్యాం కం బ్యారేజ్  ను 59 కోట్ల రూపాయల తో నిర్మాణం చేస్తుండటం విడ్డూరం అన్నారు.  ఇప్పటికైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీస్కోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.