26-03-2025 01:33:01 AM
నిజామాబాద్, మార్చి 25 (విజయ క్రాంతి): గోదావరి పరివాహక ప్రాంతాన్ని ఇసుఖ మాఫియా అక్రమార్కులు చెర పట్టారు. మధ్య రాత్రి మొదలుకొని తెల్ల వారుజాము వరకు అడ్డు అదుపు లేకుండా సాగుతున్న ఇసుక అక్రమ రవాణా కు అధికారులు సహకరించి అందిన కాడికి దండుకుంటున్నారు.
మరోవైపు అక్రమంగా ఇసుక తరలిస్తున్న ముఠా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బోధన్ డివిజన్ రూరల్ సాలురా రేంజర్ పోతనల్ కోటగిరి చక్రంపల్లి సిరికొండ ఇందల్వాయి వేల్పూర్ భీమ్గల్ ధర్పల్లి తదితర ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ పాల్పడి ఇసుకను అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లాలో నలుమూలల అను వున్న ప్రతిచోట అక్రమ ఇసుక మైనింగ్ సాగుతోంది.
అడ్డు అదుపు లేకుండా సాగుతున్న ఈ అక్రమ మైనింగ్ ముఠాలు రెవెన్యూ పోలీస్ మైనింగ్ అధికారులకు మామూలు ఇస్తూ నిరాటంకంగా ఇసుక రావణా చేస్తున్నారు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఇసుకను ఇస్తాను సారంగా తోడేసి అక్రమ మైనింగ్ ద్వారా కోట్ల కొద్ది డబ్బును పని చేసుకుంటున్నారు. అక్రమ మైనింగ్ విషయం పత్రికల ద్వారా బహిర్గ తం అవుతుండడంతో ఈ విషయంపై సిపి సాయి చైతన్య దుస్థితి సాధించారు.
నిజామాబాద్ కమిషనరేట్ సిపిగా సాయి చైతన్య బాధ్యతలు స్వీకరించిన అనంతరం అక్రమ మైనింగ్ కు పాల్పడే వారిపై కఠిన చర్యలు చేపట్టారు ముఖ్యంగా రాత్రి వేళలో ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు జరిపిన రవాణా చేసిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగి వాహనాలు సీజ్ చేసి కేసులు నమోదు చేస్తున్నారు. సాయి చైతన్య సిపిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఇప్పటివరకు అక్రమ ఇసుక మైనింగ్ ముఠాపై వారికి సంబంధించిన జెసిబిలు టిప్పర్లను సీజ్ చేసి 8 పైగా కేసులు నమోదు చేయడమే కాకుండా.
ఇసుక మైనింగ్ పై న గట్టి నిగా పెట్టాలని తన సిబ్బందిని ఆదేశిం చారు. ఇసుక మైనింగ్ జోరుగా సాగుతున్న ఇందల్వాయి వేల్పూర్ జక్రాన్పల్లి భీమ్గల్ ధర్పల్లి సిరికొండ రెంజల్ కోటగిరి పోతంగల్ సాలూర బోధన్ రూరల్ తదితర ప్రాంతాల్లో మొన్నటి వరకు అడ్డు అదుపు లేకుండా సాగిన అక్రమ మైనింగ్ కు అడ్డు కట్టబడింది. ఇసుకతో నిండి ఉన్న వాగులు కాలువల అక్రమా మైనింగ్ ముఠాలు పెద్ద పెద్ద జెసిబి లతో తోడేసి ఇసుక అక్రమ రవాణా చేసి అమ్ముకున్నారు.
ఇసుక అక్రమ రవాణా పై కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆదేశాలు రావ డంతో నిజామాబాద్ కమిషనరేట్ పరిధి లోని పలుచోట్లలో రాత్రి వేళలో పోలీసులు దాడులు నిర్వహించి జెసిబి టిప్పర్లను సీజ్ చేశారు. డంపులను స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం మేరకు ఇటీవల సీపీగా బాధ్యతలు చేపట్టిన సాయి చైతన్య అక్రమ ఇసుక మైనింగ్ అడ్డుకట్ట వేశారు.
ఇసుక నిక్షేపాలు ఉన్న పోలీస్ స్టేషన్ ల పరిధిలోని సిఐలు ఎస్‌ఐలు ఏసిపిల తో సమావేశమై పరిస్థితిని సమీక్షించి పలు ఆదేశాలు జారీ చేస్తూ అక్రమ ఇసుక మైనిం గ్ జరిగితే సంబంధిత ఠనాల పోలీసుల బాధ్యులని ఆయన హెచ్చరించారు ఇసుక అక్రమ రవాణా చేసే వారి వివరాలు సేకరించి వారి జాబితాను తయారు చేయా లని ఆయా పోలీస్ స్టేషన్లో అధికారులకు సూచించారు. పలుమార్లు పట్టుబడి పోలీసుల హెచ్చరికల బేఖాతారూ చేస్తూ అక్రమ ఇసుక మైనింగ్ పాల్పడే వారిపై కేసులు నమోదు చేసి రిమాండ్ కు తరలించాలని తీపి సాయి చైతన్య స్వచ్చమైన ఆదేశాలు సిబ్బందికి ఇచ్చారు.
స్పెషల్ బ్రాంచ్ పోలీసులు సైతం ఎప్పటికప్పుడు తమ నిఘాను ఎంపీ అక్రమ మైనింగ్ చేస్తున్న వారి పట్ల అజీనంగా వ్యవహరించా లని ఆదేశించారు. నిజామాబాద్ నగరంలో మంగళవారం సబ్ డివిజన్ల వారిగా క్రైమ్ మీటింగ్లు నిర్వహించి అక్రమ ఇసుక రావణ పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని సూచించినట్టు తెలుస్తోంది. నిజాంబాద్ జిల్లాలో ఎవరైనా ఆక్రమ మైనేకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
అక్రమ మైనింగ్ పాల్పడే వారి పూర్తి వివరాల తో కూడిన జాబితా ఇప్పటికే సిపి సాయి చైతన్యకు చేరింది. స్వయంగా ఇసుక మాఫియా పై ఉక్కు పాదం మోపుతూ కేసులను స్వయంగా సిపి పరవేక్షిస్తుండడంతో అక్రమ ఇసుక మైనింగ్ ముఠా గుండెల్లో గుబులు మొదలైంది.
అక్రమంగా ఇసుక తోడుతూ అర్ధరాత్రి పోలీసులకు పట్టుబడిన ఇసుక ముఠా జిల్లా సిపి సాయి చైతన్య ఆదేశాల మేరకు స్టార్ స్పోరట్స్ పోలీసులు బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మందర్న గ్రామ శివారులో అక్రమ ఇసుక తరలిస్తున్న 9 టిప్పర్లను ఇసుకను తోడేస్తున్న మూడు జెసిబిలను దాడులు చేసి స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.
పట్టుబడిన జెసిబిలు
టిప్పర్ లకు సంబంధించి న 12 మంది డ్రైవర్ల తో పాటు ఇతర ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు నిమిత్తం వారిని బోధన్ రూరల్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ కు అప్పగించారు.