calender_icon.png 25 February, 2025 | 4:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంజాయిపై ఉక్కు పాదం: ఎస్పీ అఖిల్ మహాజన్

20-02-2025 01:13:22 AM

సిరిసిల్ల, ఫిబ్రవరి19, (విజయక్రాంతి): జిల్లాలో గంజాయి అక్రమ రవాణా పై ఉక్కు పాదం మోపుతామని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. బుధవారం ఆయన విలేకరుల తో మాట్లాడుతూ గతంలో గంజాయి కేసులలో నిందుతులుగా ఉన్నవారిపై నిఘా ఏర్పాటు చేయడం తో పాటు గంజాయి కిట్ల సహాయంతో, నార్కోటిక్ జాగిలాలతో స్పెషల్ డ్రైవ్ లు ఏర్పాటు చేశామన్నారు.

ఈ ఏడాది  22 కేసులలో 48 మందిని అరెస్ట్ చేసి 2.200 గ్రాముల గంజాయి,12 గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నామ్మన్నారు.,జిల్లాలో గంజాయి విక్రయించిన,సాగు చేసిన, రవాణా చేసిన, సేవించిన వారి సమాచారం  871265 6392  అందించలన్నారు.

గంజాయి రహిత జిల్లాగా మార్చడాని జిల్లా పోలీస్ విన్నూత కార్యక్రమలు చేపడుతూ ప్రజల్లో అవగాహన కల్పింస్తుదని, జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై స్పెషల్ డ్రైవ్ లు,నార్కోటిక్ జగిలాలతో తనిఖీలు చేపడుతూ గంజా యి రవాణాపై ఉక్కుపాదం మోపడం జరుగుతుదన్నారు. గతంలో గంజాయి కేసులలో నిందుతులుగా ఉన్నవారిపై నిఘా ఉంచి, యూరిన్ టెస్ట్‌లు నిర్వహించి గంజాయి సేవించే వారిని వారికి గంజాయి అందించే వారిని గుర్తించి  కేసులు నమోదు చేస్తున్నామని ఎస్పీ పేర్కొన్నారు.