17-03-2025 01:35:21 AM
హైదరాబాద్, మార్చి 16 (విజయక్రాంతి): ములుగు జిల్లా వాజేడు, వెంకటా పురం, కన్నాయిగూడెం మండలాల పరిధిలోని సింజెంట, హైటెక్, బియర్ మల్టీ నేషనల్ కంపెనీలు నకిలీ మొక్కజొన్న విత్తనాలు సరఫరా చేస్తున్నాయని, ఆయా కంపె నీలపై ఉక్కుపాదం మోపుతామని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేశ్‌రెడ్డి హెచ్చ రించారు.
ఆయా కంపెనీలు రైతులకు నకిలీ విత్తనాలు అంటగడుతున్నాయని తమ దృష్టి కి వచ్చిందని, ఈ పోకడలను ఏమాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని హాకా భవన్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ఆదేశాల మేరకు తాను ఇటీవల ములుగు జిల్లాలో పర్యటించానని, ప్రైవేట్ విత్తన కంపెనీలు రైతులను మోసం చేయడాన్ని గుర్తించామని వెల్లడించారు.
రైతులకు కావాల్సిన పురుగు మందు లు, విత్తనాలు అంటగట్టి, వాటి ధరపై 5 శాతం వడ్డీ వసూల్ చేస్తున్నాయని గుర్తించామన్నారు. సింజెంట నకిలీ విత్తనాలతో వెయ్యి ఎకరాలు, హైటెక్ విత్తనాలతో 700 ఎకరాలు, బియర్ విత్తనాలతో మరో వెయ్యి ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా గుర్తించామని తెలిపారు. కొందరు కూలీలు రోగాల బారిన పడతుండడం ఆందోళన కలిగించిందన్నారు. ఇటీవల సూ ర్యాపేట, నిజామాబాద్ జిల్లాల్లోనూ ఇలాంటి ఘటనలే చోటుచేసుకున్నాన్నారు.