13-12-2024 01:03:29 AM
మాజీమంత్రి నిరంజన్‌రెడ్డి
హైదరాబాద్, డిసెంబర్ 12 (విజయక్రాంతి): చికిత్స కోసం గిరిజన రైతు హీర్యానాయక్‌ను బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకెళ్లడం దారుణమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా ఆయన గురువారం స్పంది స్తూ.. ఇందిరమ్మ రాజ్యంలో రైతన్నకు బేడీలా! ఇదేనా ప్రజాపాలన? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? అని ప్రశ్నించారు.
రైతు తనకు గుండెనొప్పి వచ్చిందన్నా ఈ పాలకుల గుండె కరగడం లేదన్నారు. ఇది ప్రజాపాలనలో లగచర్ల రైతుకు జరిగిన ఒక గొప్ప సన్మానమని విమ ర్శించారు. ఫార్మా క్లస్టర్ పేరిట తం డాల్లో మంటలు రాజేసి ఎదురు తిరిగిన రైతులపై అక్రమ కేసులు బనా యించారని మండిపడ్డారు.
అర్ధరాత్రి వారి ఇండ్లపై పడి ఆడబి డ్డలను హింసించిన సర్కారుకు అన్నదాతపై ఎంత గౌరవం ఉందో బయ టపడిందన్నారు. భూమిని నమ్ముకొని బతికే రైతన్న మీద రేవంత్ సర్కార్ ఉక్కుపాదం మోపడం మానుకోవాలని సూచించారు.