calender_icon.png 20 March, 2025 | 4:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓయూను సందర్శించిన ఇరాన్ కాన్సుల్ బృందం

19-03-2025 11:52:57 PM

హైదరాబాద్ సిటీబ్యూరో (విజయక్రాంతి): ఉస్మానియా యూనివర్సిటీని ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ కాన్సుల్ బృందం బుధవారం సందర్శించింది. బృందంలో ఆ కాన్సుల్ జనరల్ మహదీ షారోఖి, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఫాతిమా నఖ్వీ తదితరులున్నారు. ఓయూ వీసీ ప్రొ.కుమార్‌ మొలుగారం, రిజిస్ట్రార్ ప్రొ.నరేష్‌ రెడ్డి, ఓఎస్డీ ప్రొ.జితేంద్ర కుమార్‌ నాయక్, ఆఫీస్ ఆఫ్ ఇంటర్నేషనల్ అఫైర్స్(ఓఐఏ) డైరెక్టర్ ప్రొ.బి.విజయ, జాయింట్ డైరెక్టర్ డా.హమీద్, డా.నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఇరాన్ కాన్సుల్ జనరల్ మహదీ షారోఖి మాట్లాడుతూ... దక్షిణ భారతదేశంలో 7వేల మంది ఇరానియన్ విద్యార్థులునారని తెలిపారు. జేఎన్‌టీయూ, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్ధూ యూనివర్సిటీతో తమకు ఒప్పందం ఉందని చెప్పారు. ఓయూతోనూ ఎంవోయూ కుదర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. వీసీ ప్రొ.కుమార్ మొలుగారం మాట్లాడుతూ... ఇరాన్ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తామన్నారు. ఎంవోయూ ప్రక్రియను వేగవంతం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఇరాన్ కాన్సులేట్ బృందం పర్యటన భారత్, ఇరాన్ మధ్య విద్య, సాంస్కృతిక సహకారాన్ని పెంపొందించడంలో కీలకంగా మారుతుందని అధికారులు పేర్కొన్నారు.