calender_icon.png 27 April, 2025 | 3:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత్-పాక్ మధ్యవర్తిత్వానికి ఇరాన్ సిద్ధం

26-04-2025 01:11:56 AM

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: ప్రస్తుతం భారత్-పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ రెండు దేశాల నడుమ మధ్యవర్తిత్వం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్టు శుక్రవారం ఇరాన్ విదేశాంగశాఖ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ ప్రకటించారు.

భారత్-పాకిస్తాన్‌లు ఇరాన్‌కు ‘ఇరుగుపొరుగు సోదరులు’ అని అభివర్ణించారు. ‘భారత్, పాకిస్తాన్ ఇరాన్‌కు ఇరుగుపొరుగు సోదరులు. ఇతర సోదరుల వలే వారిని కూడా అత్యంత ప్రాధాన్యతగా మేము లెక్కలోకి తీసుకుంటాం. ఈ సమయంలో పరిస్థితులను మెరుగుపర్చేందుకు న్యూఢిల్లీ, ఇస్లామాబాద్‌లో ఉన్న కార్యాలయాలను ఉపయోగించుకునేందుకు టెహ్రాన్ సిద్ధంగా ఉంది’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు.