పశ్చిమాసియాలో ఇంకా ఆందోళనకర పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి. ఎప్పుడు ఎక్కడ నుంచి దాడులు జరుగుతాయో అర్థం కాని పరిస్థితులు నెలకున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్రిక్తతలు చల్లార్చేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని అగ్రరాజ్యం అమెరికా వెల్లడించింది.
జో బైడెన్ సమీక్ష...
హమాస్ చీఫ్ హనియా హత్యకు గురైన విషయం తెలిసిందే. తాజా పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సమీక్షించారు.జో బైడెన్ సమీక్షించేందుకు జాతీయ భద్రతా మండలితో సమావేశం కానున్నారు. జోర్డాన్ రాజు అబ్దుల్లాతోనూ చర్చించనున్నట్లు వైట్ హౌస్ వర్గా లు తెలిపాయి.
ఏ క్షణంలోనైనా దాడి..
తాజా పరిస్థితులపై విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ జీ7 దేశాల మంత్రులతో మాట్లాడినట్లు అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి. ఇజ్రాయిల్‌పై ఇరాన్, హెజ్బొల్లా సోమవారం దాడులు చేసే ప్రమాదముందని తమకు కచ్చితమైన సమాచారం ఉన్నట్లు ఆయన తెలిపారు.