ఆలూర్ (బెంగళూరు): అండర్ మహిళల క్రికెట్‌లో పెను సంచలనం నమోదైంది. 14 ఏళ్ల ఇరా జాదవ్ ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఆదివారం మేఘాలయాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఇరా జాదవ్ ట్రిపుల్ సెంచరీతో మెరిసింది. 157 బంతుల్లో 42 ఫోర్లు, 16 సిక్సర్లతో 346 పరుగులు సాధించింది.
యూత్ లిస్ట్ మ్యాచ్‌ల్లో భారత్ తరఫున ఇరాదే అత్యధిక స్కోరు. సౌతాఫ్రికాకు చెందిన లిజెల్లె లీ (427 పరుగులు) తొలి స్థానంలో ఉంది. ఇరా మెరుపులతో ముంబై జట్టు 50 ఓవర్లలో 563 పరుగుల రికార్డు స్కోరు సాధించింది. హర్లీ గాలా (116)తో కలిసి రెండో వికెట్‌కు 274 పరుగులు జోడించింది. మేఘాలయా 19 పరుగులకే కుప్పకూలడంతో ముంబై 544 పరుగులతో అతి పెద్ద విజయాన్ని అందుకుంది.